మసాజ్ సెంటర్ సిబ్బందిని దోచుకున్న ముగ్గురు పాకిస్తాన్ నిందితులకు జైలు శిక్ష
- November 02, 2017_1509635629.jpg)
దుబాయ్ : ముగ్గురు పాకిస్తానీ నిందితులు దొంగతనం చేసేందుకు ఒక మసాజ్ సెంటర్ ని లక్ష్యంగా చేసుకొని లోనికి దూసుకెళ్లారు. సిబ్బందికి కత్తులు చూపి మొబైల్ ఫోన్లను దొంగిలించారు. నేరం రుజువు కావడంతో కోర్టు వీరికి రెండు సంవత్సరాల జైలు శిక్ష విధించారు. ఫస్ట్ ఇన్‌స్టాన్స్ యొక్క కోర్ట్ సమాచారం మేరకు వీరు 21, 19 మరియు 21 సంవత్సరాల వయస్సులో ఉన్న పాకిస్తాన్ కు చెందినవారని పేర్కొంది. భౌతిక దౌర్జన్యం మరియు నిర్బంధ దోపిడీ ఆరోపణలు వీరిపై సాక్ష్యాలతో సహా నిరూపించబడిన నేపథ్యంలో వారికి దేశ బహిష్కరణ సైతం శిక్ష విధించబడింది. ఈ దోపిడీ గత ఏడాది నవంబరు 14, 2016 న జరిగింది., ఈ సంఘటనలో ముగ్గురు కత్తులతో బెదిరించి దొంగతనాలకు పాల్పడ్డారు. ఆ మసాజ్ సెంటర్ లో నాలుగు మొబైల్ ఫోన్లు ల్యాప్‌టాప్ ను అపహరించారు. మసాజ్ సెంటర్ లో పనిచేసే 34 ఏళ్ల ఫిల్లిపిన, ప్రాసిక్యూటర్‌తో దొంగలు ఆమెను మరియు ఇతర సిబ్బందిని ఒక గది లోపలకు బలవంతంగా నెట్టి తాళం వేసి విలువైన వస్తువులను తస్కరించారు. 33 ఏళ్ల థాయ్ మస్సీయూని సైతం ఈ దొంగలు కత్తులు చూపి వారి మొబైల్ ఫోన్లు ఇవ్వాలని ఉద్యోగులను హెచ్చరించి దోచుకొన్నట్లు బాధితులు కోర్టులో పేర్కొన్నారు.కోర్టు తీర్పు వెలువడిన తర్వాత నిందితులు తదుపరి అప్పీల్ కు 15 రోజుల చట్టపరమైన గడువులో విజ్ఞప్తి చేయవచ్చని న్యాయస్థానం తెలిపింది.
తాజా వార్తలు
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు …
- షార్జా రాజ కుటుంబంలో విషాదం
- ఇబ్రిలో ట్రక్కులో ఆకస్మికంగా మంటలు..!!
- ఐఫోన్ కొంటున్నారా? నకిలీ ఇన్స్టాగ్రామ్ స్టోర్లపై వార్నింగ్..!!
- ఖతార్ చాంబర్, భారత వ్యాపార ప్రతినిధి బృందం చర్చలు..!!
- సౌదీలో పెరిగిన నిర్మాణ వ్యయ సూచికలు..!!
- అడ్వాన్స్డ్ AI టెక్నాలజీలతో స్మార్ట్ సెక్యూరిటీ పెట్రోల్స్..!!
- బంగ్లాదేశీయులపై యూఏఈ వీసా నిషేధం? నిజమెంత?
- సమాజం పై ఎన్టీఆర్ సానుకూల ప్రభావం చూపారు: వెంకయ్య నాయుడు
- ఎయిర్ ఇండియా ఫ్లైట్: ప్రయాణికుడు చేసిన పనికి హడలి పోయిన పైలట్..