హీరో కళ్యాణ్ రామ్ రీల్ లైఫ్ లో ప్రజెంట్ తాను నటిస్తున్న ఎమ్.ఎల్.ఎ మూవీ
- November 04, 2017
నందమూరి కళ్యాణ్ రామ్ పార్టీ పెట్టాడు.. నిజమే కానీ రియల్ లైఫ్ లో కాదు. రీల్ లైఫ్ లో. ప్రజెంట్ తాను నటిస్తున్న ఎమ్.ఎల్.ఎ మూవీలో కథలో భాగంగా పార్టీ పెట్టాడట. ఆ పార్టీ గుర్తు టాప్. ఎమ్.ఎల్.ఎ అనే టైటిల్ కి ట్యాగ్ లైన్ గా మంచి లక్షణాలు ఉన్న అబ్బాయి అని పెట్టారు. దీంతో ఈ సినిమాపై క్యూరియాసిటీ ఏర్పడింది.
కళ్యాణ్ రామ్ హీరోగా ఉపేంద్ర డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఈ మూవీ, ప్రజెంట్ షూటింగ్ జరుపుకుంటోంది. ఈ చిత్రానికి సంబంధించిన ఓ పోస్టర్ ఇప్పుడు వైరల్ అయ్యింది. ఆ పోస్టర్ లో కళ్యామ్ రామ్ కొత్త పార్టీ, టాప్ గుర్తు హైలైట్ అయ్యాయి. అయితే ఈ పిక్ ని ఎవరైనా క్రియేట్ చేశారా... లేక నిజంగా సినిమాలోనిదేనా అనే విషయం ఇప్పుడు చెప్పలేం. ఎమ్.ఎల్.ఎ పై కళ్యాణ్ రామ్ స్పెషల్ కేర్ తీసుకుంటున్నాడు. ఈ మూవీలో హీరోయిన్ గా కాజల్ అగర్వాల్ నటిస్తోంది. త్వరలోనే ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
తాజా వార్తలు
- తెలంగాణతో భాగస్వామ్యానికి గూగుల్ ఆసక్తి
- భారతీయ పారిశ్రామికవేత్తలతో ట్రంప్ సమావేశం
- మీ డ్రైవింగ్ లైసెన్స్‌లో మొబైల్ నంబర్‌ను ఆన్లైన్లో ఎలా మార్చాలో తెలుసా?
- పెట్టుబడులకు ఏపీకి మించిన రాష్ట్రం లేదు..దావోస్‌లో సీఎం చంద్రబాబు
- ఇంటి నుంచే FIR? తెలంగాణ పోలీసుల కొత్త నిర్ణయం
- రియాద్ సీజన్.. 14 మిలియన్లు దాటిన విజిటర్స్..!!
- షార్జాలో పెట్రోల్ స్టేషన్లపై పోలీసుల నిఘా..!!
- ఇండియా నుంచి చేపల దిగుమతికి అనుతించండి..!!
- ఖలీఫా బ్రిడ్జిపై ట్రక్ నిషేధం పొడిగింపు..ట్రాఫిక్ అథారిటీ క్లారిటీ..!!
- కేరళ పౌల్ట్రీ దిగుమతుల పై ఒమన్ నిషేధం..!!







