గిన్నిస్ రికార్డు కోసం గరిట తిప్పిన బాబా రాందేవ్

గిన్నిస్ రికార్డు కోసం గరిట తిప్పిన బాబా రాందేవ్

కిచిడీని జాతీయ వంటకంగా ప్రకటించే అవకాశం ఉందంటూ వచ్చిన వార్తల్ని పక్కన పెట్టి, ఇప్పుడు గిన్నిస్ బుక్‌లో చోటు సంపాదించడానికి కిచిడీ సిద్దమవుతోంది. ఢిల్లీ వేదికగా 'వరల్డ్ ఫుడ్ ఇండియా కాన్ఫరెన్స్' మూడురోజుల సదస్సులో భాగంగా ప్రముఖ పాక శాస్త్రనిపుణుడు సంజవ్ కపూర్ ఆధ్వర్యంలో కిచిడీని తయారు చేస్తున్నారు. 60,000 మంది అనాథ పిల్లలకు, సదస్సులో పాల్గొనేందుకు వచ్చిన 60 దేశాలకు చెందిన ప్రతినిధులకు ఈ కిచిడీని వడ్డిస్తారు. ఇందుకు గాను 800 కేజీల ధాన్యాలతో బ్రాండ్ ఇండియా కిచిడీని తయారు చేస్తున్నారు. కిచిడీ తయారీ కార్యక్రమంలో కేంద్ర మంత్రులు హర్‌సిమ్రత్ కౌర్, సాధ్వీ నిరంజన్, యోగా గురువు బాబా రాందేవ్‌లు కూడా హాజరయ్యి వారు కూడా గరిట తిప్పారు. 

Back to Top