నిందితుల అప్పగింత వ్యవహారం భారత్ దరఖాస్తులను తిరస్కరించిన బ్రిటన్ కోర్టు
- November 05, 2017
బ్రిటన్‌లో తలదాచుకుంటున్న నిందితులను రప్పించేందుకు.. భారత్ ఇటీవల చేసిన రెండు ప్రయత్నాలు విఫలమయ్యాయి. క్రికెట్ ఫిక్సింగ్ కేసు నిందితుడు సంజీవ్‌కుమార్ చావ్లాను, 1990-93 మధ్య బ్యాంకును మోసగించిన కేసులో నిందితులైన జతిందర్, ఆశారాణి దంపతులను అప్పగించాలని.. భారత అధికారులు చేసిన దరఖాస్తులను బ్రిటన్ కోర్టు తిరస్కరించింది. భారత్‌లో రూ.9వేల కోట్ల మేర బ్యాంకు రుణాలు ఎగవేసి లండన్‌కు పారిపోయిన మద్యం వ్యాపారి విజయ్ మాల్యా.. అప్పగింతకు సంబంధించిన కేసులోనూ ఈ కోర్టే వాదనలు వింటోంది. నవంబరు 20న ఈ కేసులో తదుపరి విచారణ జరుగనుంది. ఇటు సంజీవ్‌కుమార్ అప్పగింత కోసం చేసిన దరఖాస్తును విచారిస్తూ.. భారత్‌లోని తిహార్ జైల్లో అతడు అధికారులు, ఇతర ఖైదీల చేతిలో హింసకు గురయ్యే అవకాశముందని భావిస్తున్నట్లు కోర్టు తెలిపింది. తిహార్‌లో మానవ హక్కుల ఉల్లంఘనలు సాధారణమన్న నిపుణుల వాదన ఆధారంగా..
అక్టోబర్ 16న ఈ దరఖాస్తును తోసిపుచ్చింది. మరోవైపు జతిందర్, ఆశారాణిలు ఎదుర్కుంటున్న నేరారోపణలు పాతికేళ్ల నాటివని వ్యాఖ్యానించిన కోర్టు.. జాప్యంతోపాటు ఇతరత్రా కారణాలనూ చూపుతూ భారత దరఖాస్తును అక్టోబర్ 12న తిరస్కరించింది.
తాజా వార్తలు
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్‌లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!







