మూడేళ్ల తర్వాత సుకుమార్, మహేష్ కాంబోలో సినిమా

- November 06, 2017 , by Maagulf
మూడేళ్ల తర్వాత సుకుమార్, మహేష్  కాంబోలో సినిమా

మహేష్ తన సినీ కెరీర్ లోనే ఎన్నడూ లేనంత స్పీడ్ గా సినిమాలను చేస్తున్నాడు.. ఒక సినిమా తర్వాత మరో సినిమా సెట్స్ మీదకు తీసుకొని వెళ్తున్నాడు.. ఈనేపద్యంలో హాలీవుడ్ స్టైల్ ఆఫ్ మేకింగ్ తో తెలుగు ప్రేక్షకులను మెస్మరైజ్ చేసిన కాంబో తో మహేశ్ బాబు సినిమా చెయ్యబోతున్నాడు. పొలిటికల్ థ్రిల్లర్ భరత్ అనే నేను సినిమా షూటింగ్ ను పరుగులు పెట్టిస్తూనే నెక్ట్స్ ప్రాజెక్ట్స్ ను ఫైనల్ చేస్తున్నాడు. ఆల్రెడీ కెరీర్ లో మైల్ స్టోన్ గా నిలిచిపోయే 25వ సినిమాను స్టార్ట్ చేసిన మహేశ్ బాబు, ఇప్పుడు సుకుమార్ దర్శకత్వంలో సినిమా చెయ్యడానికి కమిట్ అయ్యాడు.
సుకుమార్-మహేశ్ బాబు కాంబినేషన్ లో ఇంతకుముందు వన్ నేనొక్కడినే సినిమా వచ్చింది. ఈసినిమా స్టైలిశ్ యాక్షన్ ఫ్లేవర్ లో తెరకెక్కి టాలీవుడ్ మేకర్స్ ను మెస్మరైజ్ చేసింది. రాజమౌళి కూడా ఈసినిమాకు ఫిదా అయిపోయాడు. అయితే ఈసినిమా ప్రేక్షకుల అంచనాలను అందుకోవడంలో తడబడింది. అయినా సూపర్బ్ సినిమాగా రెస్పాన్స్ తెచ్చుకుంది. మళ్లీ ఇప్పుడు మూడేళ్ల తర్వాత వీళ్లిద్దరి కాంబినేషన్ లో సినిమా రాబోతోంది. సుకుమార్ ఇప్పుడు రామ్ చరణ్ రంగస్థలం 1985తో బిజీగా ఉన్నాడు. ఈసినిమా సమ్మర్ లో రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఈసినిమా తర్వాత సుకుమార్ మహేశ్ తో సినిమా చేస్తాడట. ఈ లోపు మహేశ్ భరత్ అను నేను సినిమాను ఫినిష్ చేసి, వంశీపైడిపల్లి సినిమాను సెట్స్ కు తీసుకెళ్తాడట. సుక్కూ-మహేశ్ కాంబినేషన్ లో రాబోయే ఈసినిమా 14రీల్స్ లో నిర్మాణం కాబోతోంది. ఆగడు ఫ్లాప్ తో 14రీల్స్ కు ఓ సినిమా చేస్తానని ఇంతకుముందే మహేశ్ ప్రామిస్ చేశాడు. ఆ కమిట్మెంట్ నుంచే ఈసినిమా స్టార్ట్ అవుతోంది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com