గుజరాత్‌లో తెల్లవారుజామున ఘోర ప్రమాదం : 13 మంది మృతి

- November 07, 2017 , by Maagulf
గుజరాత్‌లో తెల్లవారుజామున ఘోర ప్రమాదం : 13 మంది మృతి

గుజరాత్‌లో మంగళవారం తెల్లవారుజామున ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. కేదాల్‌లోని కతలాల్ ప్రాంతంలో వెనుక నుంచి వచ్చిన తుపాన్ వాహనం.. ముందు వెళ్తున్న ట్రక్కును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 13 మంది ప్రాణాలు కోల్పోగా.. మరో 9 మంది తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదస్థలికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదానికి అతి వేగమే కారణమని పోలీసులు భావిస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com