ఇ ఈ' చిత్రంలోని అమ్మ పాటను రిలీజ్ చేసిన రెహమాన్
- November 07, 2017
నీరజ్ శ్యామ్, నైరా షా జంటగా నటించిన చిత్రం 'ఇ ఈ'. ఈ చిత్రంలోని అమ్మా, నీతోనే నేను అనే పాటలను మ్యూజిక్ సంచలనం ఆస్కార్ అవార్డ్ విన్నర్ ఏ.ఆర్.రెహమాన్ విడుదల చేయడం విశేషం. చెన్నైలో రెహమాన్ చిత్ర యూనిట్ తో కలిసి విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఇ ఈ చిత్రంలోని అమ్మా అనే పాటను విడుదల చేయడం చాలా హ్యాపీగా ఉంది. కృష్ణ చైతన్య మంచి టాలెంటెడ్.. హార్డ్ వర్కింగ్ మ్యూజిషియన్. అతనికి మంచి భవిష్యత్ ఉంది. చిత్ర యూనిట్ కు నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అని అన్నారు.
ఈసందర్భంగా చిత్ర దర్శకుడు రామ్ గణపతిరావు మాట్లాడుతూ... మాకు బిగ్ డే ఈరోజు. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన, భారతీయులు సగర్వంగా తలెత్తుకునేలా చేసిన సంగీత దర్శకుడు ఏ.ఆర్.రెహమాన్ గారు మా ఇ ఈ చిత్రంలోని పాటల్ని విడుదల చేయడం నిజంగా మా అదృష్టం. ఆయనకు ఈ సందర్భంగా మా చిత్ర యూనిట్ తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ప్రేమ కథా చిత్రాల్లో సరికొత్త పంథాలో మా ఇ ఈ చిత్రం ఉంటుంది. అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఎంటర్ టైన్ చేస్తుంది. నా స్నేహితుడు దర్శకుడు మారుతి ఇటీవలే రిలీజే చేసిన ట్రైలర్ కు విశేష స్పందన లభించింది. త్వరలోనే ఈ సినిమా విడుదల తేదీని ప్రకటిస్తాం. అని అన్నారు. నీరజ్ శ్యామ్, నైరా షా జంటగా నటిస్తున్న ఈ చిత్రంలో సీనియర్ నటుడు సుధాకర్ కీలక పాత్రలో నటిస్తున్నారు. నవబాల క్రియేషన్స్ పతాకంపై లక్ష్మణ్‌రావు ‘ఇ ఈ’చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కృష్ణ చేతన్ టీఆర్ స్వరాలు సమకూరుస్తున్నారు.
తాజా వార్తలు
- త్వరలో వెబ్‌లో గ్రూప్ వీడియో, ఆడియో కాల్స్ సౌకర్యం
- దావోస్ కు బయల్దేరిన చంద్రబాబు, రేవంత్ రెడ్డి
- స్పెయిన్ లో ఘోర రైలు ప్రమాదం.. 21 మంది మృతి
- ఎన్ఆర్ఐ టీడీపీ బహ్రెయిన్ ఆధ్వర్యంలో ఎన్టిఆర్ 30వ వర్ధంతి
- అవాలి అభివృద్ధి మాస్టర్ ప్లాన్ పై కింగ్ హమద్ సమీక్ష..!!
- యూఏఈ దిర్హమ్కు రూ.25కు చేరువలో భారత రూపాయి..!!
- విదేశీ వాహనదారులకు ఖతార్ గుడ్ న్యూస్..!!
- రియాద్ లో దక్షిణ యెమెన్ నాయకులు..కీలక ప్రకటన..!!
- కువైట్ ‘లులు’లో బ్రిటిష్ డెయిరీ ప్రొడక్ట్స్ వీక్..!!
- ఒమన్‌లో 8.5% పెరిగిన బ్యాంకు లోన్లు..!!







