ఒమన్ లోని 90 శాతం అవసరాలకు పాడి పరిశ్రమని అనుసంధానం చేసే ప్రణాళిక

- November 07, 2017 , by Maagulf
ఒమన్ లోని  90 శాతం అవసరాలకు పాడి పరిశ్రమని అనుసంధానం చేసే ప్రణాళిక

మస్కాట్:  సుల్తానేట్ లో దాదాపు 90 శాతం అవసరాలకు అనుగుణంగా సమీకృత పాడి పరిశ్రమను మజాన్ పాడి ఉత్పత్తుల సంస్థ  సామర్ధ్యంతో కూడిన ఒక విధానం ఏర్పాటు చేస్తుంది. సుల్తానేట్ పరిధి అల్ బురైమి గవర్నైట్ లో మజాన్ పాడి ఉత్పత్తుల సంస్థ ఆహార భద్రత ఉత్పత్తులతో సంబంధం ఉన్న సంస్థలలో ఒక ముఖ్యమైనది. పది సంవత్సరాలలో పాల ఉత్పత్తుల అవసరాలలో 87 శాతం అవసరాలను తీర్చేందుకు కృషి చేయడమే కాక  2040 నాటికి ఇతర ప్రాంతాలకు ఇక్కడినుంచి ఎగుమతి చేయాలని లక్ష్యంగా పెట్టుకొంది.  పాడి ఉత్పత్తుల అనుసంధాన వ్యవసాయాన్ని స్థాపించాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ప్రణాళికను అల్-బురైమి గవర్నరేట్లో అల్ విలాయత్ సినాయ్నహ్ లో 2,300 ఉద్యోగాలకు అవకాశం ఏర్పాటుకానుంది. 70 శాతం ఒమన్ లో ఉపాధి అవసరాలను తీరుస్తుంది. ఈ ప్రాజెక్ట్ సుల్తానేట్ విధానాలకు అనుగుణంగా నిలిచి ఆహార భద్రతకు స్థిరమైన అభివృద్ధికి మూల స్తంభాలుగా నిలుస్తుంది. వాణిజ్య మరియు పరిశ్రమల మంత్రిత్వశాఖ పర్యవేక్షణలో ఆహార భద్రతతో ముడిపడివున్న పాలు సంబంధిత వివిధ ఆహారపదార్థాలు  ఆహార ప్రాసెసింగ్ మరియు సముద్ర ఉత్పత్తులను జాగ్రత్తగా భద్రపర్చడంతో పాటు ఇతర ప్రాజెక్టులలో సమీకృత వ్యవసాయ క్షేత్రాలు స్థాపనకు కృషి చేయనున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com