దుబాయ్ షాపింగ్ ఫెస్టివల్ ఎప్పుడంటే
- November 08, 2017ప్రపంచంలోనే మోస్ట్ పాపులర్ షాపింగ్ ఈవెంట్స్‌లో ఒకటైన దుబాయ్ షాపింగ్ ఫెస్టివల్‌కి సంబంధించి ఓపెనింగ్ డేట్‌ని దుబాయ్ టూరిజం ప్రకటించింది. దుబాయ్ టూరిజం ట్విట్టర్లో వెల్లడించిన వివరాల ప్రకారం 2017 డిసెంబర్ 26 నుంచి 2018 జనవరి 27 ఈ షాపింగ్ ఫెస్టివల్ నెలరోజులపాటు జరగనుంది. ఫ్యాషన్ షోలు, ఫైర్ వర్క్స్ డిస్ప్లేస్, మెగా సేల్స్ ఇంకా ఎన్నెన్నో ప్రత్యేక ఆకర్షణలతో దుబాయ్ షాపింగ్ ఫెస్టివల్ షాపింగ్ ప్రియుల్ని అలరించనుంది. అద్భుతమైన ఈవెంట్లు, గ్రేట్ రఫాల్స్, ఇంకా ఇంకా చాలా ఆకర్షణలు దుబాయ్ షాపింగ్ ఫెస్టివల్ ప్రత్యేకతలు. డిసెంబర్ 26న 12 గంటలపాటు ప్రత్యేకమైన సేల్ ఆఫర్స్, అదనపు డిస్కౌంట్లు దుబాయ్ షాపింగ్ ఫెస్టివల్లో ఉంటాయి. మధ్యాహ్నం 12 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు ఎంపిక చేసిన ఔట్‌లెట్స్‌లో సిటీ అంతటా ఈ ఆఫర్లు వర్తిస్తాయి.
తాజా వార్తలు
- సిబిఎస్ఇ లో రాణించిన భారత పాఠశాల విద్యార్థులు
- మరో ఘనతకు సిద్ధమవుతున్న కువైట్ ఎయిర్ పోర్ట్..!
- సౌదీలో SR3000 గరిష్ఠ డ్యూటీ ఫ్రీ పరిమితి విధింపు
- వావ్.. దుబాయ్ కొత్త విమానాశ్రయం ఫోటోస్ ఔట్
- ఖతార్ ఎకనామిక్ ఫోరమ్ ప్రారంభం
- యూఏఈలో పురాతన నీటిపారుదల వ్యవస్థ పునరుద్ధరణ
- ఏపీలో టెన్షన్ టెన్షన్..
- ఏపీలో రికార్డు స్థాయిలో పోలింగ్..
- మెట్రో అమ్మకం పై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
- హైదరాబాద్ నెహ్రూ జూలాజికల్ పార్క్ లో మగ తెల్లపులి మృత్యువాత