నివాస అనుమతి తర్వాత ఉద్యోగ పేర్ల మార్పు పట్ల మంత్రిత్వ శాఖ మండిపాటు
- November 08, 2017
జెడ్డా : ' ఏకులా వచ్చి.... మేకు అయినట్లు ' నివాస అనుమతి (ఇక్మాస్) ద్వారా దేశంలోకి వచ్చి ఆ తర్వాత వారి ఉద్యోగ పేర్లను మార్చడం వేరే ఉద్యోగులుగా వారిని కొనసాగించడం వంటి అక్రమ విధానాల పట్ల లేబర్ అండ్ సోషల్ డెవలప్మెంట్ మంత్రిత్వశాఖ తీవ్రంగా పరిగణించనుందని అల్-మదీనా అరబిక్ వార్తాపత్రిక బుధవారం నివేదించింది. అయితే, ఉద్యోగం టైటిల్ మార్చడానికి ఏ అనుమతి లేదని వారి నిర్ణయం ఒక ఎలక్ట్రానిక్ మార్పు కోరడమేనని పేర్కొన్నారు. నాలుగు వారాల దయ కాలంలో నమోదు ఇతర కార్యకలాపాలలో చేరిక, తదితర స్థాపనల మార్పు సోమవారంతో ముగిసింది . మంత్రిత్వ శాఖ ఈ ఉల్లంఘనలను తనిఖీ చేసేందుకు దేశంలో పర్యటనలు చేపట్టనుంది.ఈ నిబంధననలను అతిక్రమించిన ఒక్కో వ్యక్తికి జరిమానా 25.000 సౌదీ రియాళ్ళ మొత్తం ఉంటుందని తెలిపింది నిటాక్ట్ వ్యవస్థలో నిష్పత్తి మరియు పద్ధతిని మార్చిన తర్వాత సౌదీకరణ రేట్లను లెక్కించడం జరుగుతుంది. ఆ తర్వాత పరిహార పని వీసాలు సైతం మంత్రిత్వశాఖ నిలిపివేయనుంది. 60 సంవత్సరాల వయస్సు పైబడిన సౌదీ వ్యక్తులను ప్రైవేటు రంగంలో ఉద్యోగాలు పొందవచ్చని అయితే వారిని సౌదీకరణ జాబితాలో లెక్కించడం సాధ్యపడదని మంత్రిత్వ శాఖ పేర్కొంది.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







