కారు డ్రైవర్‌కి కాస్ట్లీ గిప్ట్ ఇచ్చిన హీరోయిన్ అనుష్క
- November 09, 2017
సినిమా హిట్టయితే నిర్మాతలు హీరోలకి, హీరోలు డైరక్టర్లకి కార్లు బహుమతులుగా ఇచ్చుకోవడం ఇండస్ట్రీలో సహజంగా జరుగుతుంటుంది. ఈ సెలబ్రిటీలు పుట్టిన రోజు వేడుకల్లో కూడా ఇలాంటి కానుకలు పొందుతుంటారు. ముద్దుగా స్వీటీ అని పిలుచుకునే అనుష్క టాలీవుడ్‌లో అగ్ర కథానాయికగా వెలుగొందుతూ బోల్డంతమంది అభిమానుల్ని సంపాదించుకుంది. లేడీ ఓరియంటెడ్ పాత్రల్లో నటించి ప్రేక్షకుల్ని మెప్పించింది. దాదాపు అందరి అగ్ర హీరోల సరసన నటించింది. ఈ నేపథ్యంలో తన 36వ పుట్టినరోజు వేడుకల్ని జరుపుకుంది. ఈ సందర్భంగా తన డ్రైవర్‌కు 12 లక్షల విలువ చేసే కారును బహుకరించింది.
తనకు ఎంతో ఇష్టమైన డ్రైవర్‌కు కారును బహుకరించింది. డ్రైవర్‌కు కారును గిప్ట్ ఇచ్చిన ఏకైక సెలబ్రిటీగా అనుష్క వార్తల్లోకి ఎక్కారు. ఆ డ్రైవర్ సీనియర్ కావడంతో పాటు అత్యంత విస్వాసపాత్రుడు కూడా అవడంతో అనుష్కకు అతని పట్ల చాలా అభిమానం అని అందుకే అతని ఆ గిప్ట్ ఇచ్చిందని తెలిసింది.
తాజా వార్తలు
- న్యూఢిల్లీలో IEC వార్షిక సమావేశంలో పాల్గొన్న ఖతార్..!!
- పాలస్తీనాను గుర్తించిన యూకే, కెనడా, ఆస్ట్రేలియా, పోర్చుగల్..!!
- యూఏఈలో ఆన్లైన్ ఫుడ్ డెలివరీలను నిషేధించిన స్కూల్స్..!!
- నివాస ప్రాంతాలలో బ్యాచిలర్ హౌసింగ్.. కఠిన చర్యలు..!!
- మసాజ్ పార్లర్ల ద్వారా మనీలాండరింగ్..!!
- స్వదేశానికి తిరిగి వచ్చిన సయ్యిద్ బిలారబ్..!!
- షేక్ హ్యాండ్ ఇద్దాం రండీ..టీమ్ఇండియా ఆటగాళ్లను కోరిన గంభీర్
- తెలంగాణ నుంచి మరో 2 వందేభారత్ రైళ్లు
- జీఎస్టీ 2.0పై సీఎం చంద్రబాబు స్పందన..
- కొత్త కారు కొనేవాళ్లకు ఇక పండగే అంటున్న భారత ప్రభుత్వం