'కిల్లింగ్ వీరప్పన్'పై బెంగళూరు నగర సివిల్ కోర్టు స్టే
- November 09, 2015
రాంగోపాల్‌వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన 'కిల్లింగ్ వీరప్పన్' చిత్రం విడుదలపై బెంగళూరు నగర సివిల్ కోర్టు స్టే విధించింది. తమిళనాడు, కర్ణాటక, కేరళ రాష్ట్రాల పోలీసులను ముప్పుతిప్పలు పెట్టిన అడవిదొంగ వీరప్పన్ జీవిత చరిత్ర ఆధారంగా 'కిల్లింగ్ వీరప్పన్' పేరుతో రాంగోపాల్ వర్మ చిత్రాన్ని రూపొందించిన చిత్రంపై కన్నడ, తమిళ చలనచిత్ర రంగానికి చెందిన రాజు అనే వ్యక్తి కోర్టును ఆశ్రయించారు. వీరప్పన్ జీవిత చరిత్రను ముద్రించడానికి, తెరకెక్కించడానికి తనకే సర్వహక్కులు ఉన్నట్లు ఈ మేరకు వీరప్పన్ భార్య ముత్తులక్ష్మీ తనకు లిఖిత పూర్వకంగా అనుమతిచ్చారని రాజు కోర్టుకు తెలిపారు. దీంతో 'కిల్లింగ్ వీరప్పన్' సినిమా విడుదలపై స్టే ఇస్తూ న్యాయస్థానం సోమవారం ఆదేశాలు జారీ చేసింది. కాగా, ఈ చిత్ర దర్శకుడు రాంగోపాల్‌వర్మతో పాటు నిర్మాత కూడా కోర్టుకు తమ వాదనలు వినిపించడానికి రెండు మూడు రోజుల్లో రానున్నట్లు సమాచారం. కిల్లింగ్ వీరప్పన్‌లో శాండల్‌వుడ్ స్టార్ శివరాజ్‌కుమార్ ప్రధాన పాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్‌లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్‌లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్‌సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్‌లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్‌లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!







