'ఒక్కడు మిగిలాడు' లో హీరో ఎంట్రీ ఎక్కడ?

- November 09, 2017 , by Maagulf
'ఒక్కడు మిగిలాడు' లో హీరో ఎంట్రీ ఎక్కడ?

మనది హీరోల చుట్టూ తిరిగే ఇండస్ట్రీ. మన సినిమాలు కూడా అలాగే నడుస్తాయి. సినిమా స్క్రీన్ టైంలో కనీసం 80 శాతం హీరో కనిపించాలి. ప్రతి సన్నివేశంలోనూ హీరో ఉండాలి. లేకపోతే హీరో ప్రస్తావన అయినా ఉండాలి. అంతగా హీరోకు ప్రాధాన్యం ఇస్తారు మన దర్శకులు. ఐతే ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రాబోతున్న మంచు మనోజ్ సినిమా 'ఒక్కడు మిగిలాడు'లో మాత్రం హీరో 40 నిమిషాల పాటు కనిపించడట.
ఈ చిత్ర ద్వితీయార్ధంలో తన పాత్ర 40 నిమిషాల పాటు ఉండదని మనోజే స్వయంగా వెల్లడించాడు. మరి దర్శకుడు అజయ్ నూతక్కి ఇంత పెద్ద సాహసం చేయడం.. మనోజ్ అందుకు అంగీకరించడం విశేషం.
శ్రీలంకలో తమిళుల కష్టాల నేపథ్యంలో సాగే సినిమా 'ఒక్కడు మిగిలాడు'. ఇందులో మనోజ్‌తో పాటు దర్శకుడు అజయ్ కూడా ఓ కీలక పాత్ర పోషించాడు. ద్వితీయార్దంలో అతడి పాత్రే హైలైట్ అవుతుందట. సముద్రం నేపథ్యంలో సాగే ఒక ఎపిసోడ్ సినిమాకు ఆయువు పట్టు అని చెబుతున్నారు. ఆ ఎపిసోడ్ మొత్తంలో మనోజ్ కనిపించడట. మరి మనోజ్ చేసిన ఈ రిస్క్ ఎలాంటి ఫలితాన్నిస్తుందో..
ప్రేక్షకులు దీన్ని ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలి. మనోజ్ ఇందులో ఎల్టీటీఈ వ్యవస్థాపకుడు ప్రభాకరన్ స్ఫూర్తితో తీర్చిదిద్దన ఒక పాత్రను.. ఒక స్టూడెంట్ లీడర్ పాత్రను చేస్తున్నాడు. ఈ సినిమా కోసం పడ్డ కష్టం.. కెరీర్లో ఇంతకుముందెన్నడూ పడలేదని మనోజ్ అంటున్నాడు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com