ఆదివారం మొదలుకానున్న 'లక్ష్మీస్‌ వీరగ్రంథం'

- November 11, 2017 , by Maagulf
ఆదివారం మొదలుకానున్న 'లక్ష్మీస్‌ వీరగ్రంథం'

విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు నందమూరి తారక రామారావు జీవితం ఆధారంగా సినిమాలను తెరకెక్కించడానికి దర్శక, నిర్మాతలు ఆసక్తి చూపుతున్నారు. ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ 'లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌' టైటిల్‌తో సినిమాను తీస్తున్నట్లు ప్రకటించారు. ఎన్టీఆర్‌ జీవిత కథతో బాలకృష్ణ-తేజ కాంబినేషన్లో ఓ చిత్రం తెరకెక్కనుంది. మరోపక్క ఎన్టీఆర్‌ బయోపిక్‌ను తీస్తానని సీనియర్‌ దర్శకుడు కేతిరెడ్డి జగదీశ్వర్‌రెడ్డి ఇటీవల ప్రకటించారు. ఈ చిత్రానికి 'లక్ష్మీస్‌ వీరగ్రంథం' అనే టైటిల్‌ను కూడా ఖరారు చేశారు. 'ఆదర్శ గృహిణి' అనేది ఉపశీర్షిక. ఈ సినిమాను షూటింగ్‌ను ఆదివారం ప్రారంభిస్తున్నట్లు చిత్ర బృందం పేర్కొంది. ఈ మేరకు ఓ పోస్టర్‌ను విడుదల చేసింది. ఉదయం 11.30 నుంచి 12.30 గంటల మధ్యలో పూజా కార్యక్రమం జరగనున్నట్లు తెలిపింది. ఎన్టీఆర్‌ గార్డెన్‌లో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ప్రచార చిత్రంలో పేర్కొంది.

జయం మూవీస్‌ సంస్థ 'లక్ష్మీస్‌ వీరగ్రంథం' చిత్రాన్ని సమర్పిస్తోంది. ప్రీతమ్‌ స్వరాలు అందిస్తున్నారు. ఎన్టీఆర్‌పై ఉన్న ప్రేమతో ఆయన బయోపిక్‌ను తీస్తున్నట్లు జగదీశ్వర్‌రెడ్డి తెలిపారు. లక్ష్మీపార్వతి పాత్ర కోసం వాణి విశ్వనాథ్‌, రాయ్‌లక్ష్మీలను సంప్రదించినట్లు పేర్కొన్నారు. జనవరిలో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నట్లు చెప్పారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com