అమరావతిలో భారతదేశపు మొట్టమొదటి 'సోషల్ మీడియా సమ్మిట్ అవార్డ్స్'
- November 11, 2017
సామాజిక మాధ్యమాల్లో అత్యంత ప్రాచుర్యం పొందిన భారతీయుడిగా బాలీవుడ్ దిగ్గజం అమితాబ్ బచ్చన్‌కు పురస్కారం ప్రకటించారు. ఏడు పదుల వయసులోనూ యువతకు దీటుగా సామాజిక మాధ్యమాల్లో చురుగ్గా ఉంటారు అమితాబ్. ఇక నటీమణుల్లో ప్రాచుర్యం పొందిన వ్యక్తిగా దీపికా పదుకొణె నిలిచారు. విజయవాడలో ఈ నెల 18, 19వ తేదీల్లో సోషల్ మీడియా సమ్మిట్ అవార్డ్స్ వేడుక జరగబోతోంది. గూగుల్ ఇండియా, ఫేస్బుక్, ట్విట్టర్ సంస్థలు సంయుక్తంగా నిర్వహించే ఈ వేడుక ఆంధ్రప్రదేశ్ పర్యటక శాఖ ఆధ్వర్యంలో జరుగుతుంది. అందులో సినీ ప్రముఖులు అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొణెతో పాటు సంగీత సంచలనంగా అనిరుథ్, అత్యంత ప్రాచుర్యం పొందిన దక్షిణ భారత తారగా రానా దగ్గుబాటి, ప్రాచుర్యం పొందిన సినీ విమర్శకుడిగా తరణ్ ఆదర్శ్ పురస్కారాలు అందుకోబోతున్నట్టు సమ్మిట్ ప్రతినిధులు తెలిపారు. సామాజిక అనుసంధాన వేదికల్ని సమర్థవంతంగా వినియోగించుకొనే పలువురు సినీ తారలతో పాటు, దేశవ్యాప్తంగా సామాజిక అనుసంధాన వేదికలపై ప్రభావం చూపుతున్న 500మంది వ్యక్తులు ఈ వేడుకల్లో పాల్గొనబోతున్నట్టు తెలిపారు. యూట్యూబ్, ఫేస్బుక్, ట్విట్టర్ సంస్థల ఇండియా ప్రతినిధులతో పాటు పలువురు ప్రముఖులు పాల్గొనబోతున్నారు.
తాజా వార్తలు
- మెటా సేవలకు అంతరాయం..ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ డౌన్!
- ఇరాన్ రాయబారిని పిలిపించిన జోర్డాన్.. క్షిపణి దాడులు వెంటనే నిలిపివేయాలని డిమాండ్
- రాజమండ్రిలో తొలి కరోనా కేసు నమోదు
- అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్న జనసేన పార్లమెంటరీ పార్టీ నేత బాలశౌరి
- అకాబా విమానాశ్రయం, పోర్టుకు ఎలాంటి ముప్పు లేదు: జోర్డాన్ ప్రభుత్వం
- సరికొత్త చరిత్ర సృష్టించిన పీవీ సింధు
- తిరుమలలో రూమ్ ఎలా పొందాలో తెలుసా?
- ఇరాన్ రెండో దాడితో కువైట్ విద్యుత్ కేంద్రంలో భారీ అగ్నిప్రమాదం.. అత్యవసర ప్రణాళికలు అమలు
- యూఏఈలో సీబీఎస్ఈ గ్రేడ్ 10 ఫలితాలు విడుదల..నెలల అనిశ్చితికి తెర..!!
- సౌదీలో భారీ స్మగ్లింగ్ యత్నాలు భగ్నం..!!







