శ్రీలంకతో మూడు టెస్టుల సిరీస్ కోసం కోలకతా చేరుకున్న టీమిండియా
- November 13, 2017
పర్యాటక జట్టు శ్రీలంకతో మూడు టెస్టుల సిరీస్ కోసం టీమిండియాలోని కొందరు ఆటగాళ్లు ఆదివారం రాత్రికి కోల్‌కతా చేరుకున్నారు. ఉమేశ్ యాదవ్, శిఖర్ ధావన్, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, రోహిత్ శర్మ, రహానెతో పాటు కోచ్ రవిశాస్త్రి కూడా ఇప్పటికే కోల్‌కతా వచ్చారు. సారథి విరాట్ కోహ్లీతో పాటు మిగిలిన ఆటగాళ్లు సోమవారం జట్టు సభ్యులతో కలవనున్నారు. విశ్రాంతి పేరుతో ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యను టెస్టు సిరీస్ నుంచి పక్కన పెట్టిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది శ్రీలంక వేదికగా జరిగిన ఐదు టెస్టు మ్యాచుల సిరీస్‌ను భారత్ క్లీన్‌స్వీప్ చేసిన సంగతి తెలిసిందే. అదీగాక లంక ఇప్పటి వరకు భారత గడ్డపై ఒక్క టెస్టు కూడా గెలవలేదు. ఈ పర్యటనలో ఎలాగైనా టెస్టు గెలిచి ఖాతా తెరవాలని భావిస్తోంది. సిరీస్‌లో భాగంగా భారత్-శ్రీలంక మధ్య తొలి టెస్టు ఈ నెల 16న ఈడెన్ గార్డెన్స్‌లో ప్రారంభంకానుంది. బోర్డు ఎలెవన్ ప్రెసిడెంట్స్‌తో జరిగిన తొలి సన్నాహక మ్యాచ్‌ను శ్రీలంక డ్రా చేసుకున్న సంగతి తెలిసిందే.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







