జనవరి 1 నుంచి రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ ఇవ్వనున్న కెసిఆర్
- November 13, 2017
రైతులకు రూ.8వేల పెట్టుబడి సాయం వచ్చే ఏడాది నుంచి అమలు చేస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ శాసనసభలో ప్రకటించారు. రైతులకు పెట్టుడి సాయంపై సభలో జరిగిన స్వల్పకాలిక చర్చ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడారు. సమైక్య రాష్ట్రంలో గ్రామీణ వ్యవస్థలన్నీ నిర్వీర్యమైపోయాయని అన్నారు. గతంలో చాలా వ్యవస్థలు, నిధులు గ్రామ, మండల సమితుల చేతుల్లో ఉండేవని.. కాంగ్రెస్ పార్టీ వాటిని కేంద్రీకృతం చేస్తే.. భాజపా ప్రభుత్వం అదే విదానాన్ని కొనసాగిస్తోందన్నారు. జనవరి 1 నుంచి రైతులకు 24 గంటలు విద్యుత్ సరఫరా చేయనున్నట్లు కేసీఆర్ ప్రకటించారు.
విపక్షాలు అనవసర విమర్శలు మానుకొని ప్రభుత్వానికి సహకరించాలని కేసీఆర్ కోరారు. ప్రాజెక్టులు పూర్తికాకూడదు, చెరువులు నిండకూడదు, ప్రజలకు తాగునీరు అందకూడదని కాంగ్రెస్ నేతలు కోరుకుంటున్నారని మండిపడ్డారు. రైతులకు న్యాయం చేసేది తెరాస మాత్రమేనని.. అందుకే రైతు సమన్వయ సమితుల్లో తెరాస కార్యకర్తలే ఉంటారని స్పష్టం చేశారు. సంక్షేమ పథకాలు ఆపాలన్నదే కాంగ్రెస్ పార్టీ లక్ష్యమన్నారు.ఒక్క కాళేశ్వరం ప్రాజెక్టుపైనే 196 కేసులు వేశారని తెలిపారు.
తాజా వార్తలు
- సమాజం పై ఎన్టీఆర్ సానుకూల ప్రభావం చూపారు: వెంకయ్య నాయుడు
- ఎయిర్ ఇండియా ఫ్లైట్: ప్రయాణికుడు చేసిన పనికి హడలి పోయిన పైలట్..
- న్యూఢిల్లీలో IEC వార్షిక సమావేశంలో పాల్గొన్న ఖతార్..!!
- పాలస్తీనాను గుర్తించిన యూకే, కెనడా, ఆస్ట్రేలియా, పోర్చుగల్..!!
- యూఏఈలో ఆన్లైన్ ఫుడ్ డెలివరీలను నిషేధించిన స్కూల్స్..!!
- నివాస ప్రాంతాలలో బ్యాచిలర్ హౌసింగ్.. కఠిన చర్యలు..!!
- మసాజ్ పార్లర్ల ద్వారా మనీలాండరింగ్..!!
- స్వదేశానికి తిరిగి వచ్చిన సయ్యిద్ బిలారబ్..!!
- షేక్ హ్యాండ్ ఇద్దాం రండీ..టీమ్ఇండియా ఆటగాళ్లను కోరిన గంభీర్
- తెలంగాణ నుంచి మరో 2 వందేభారత్ రైళ్లు