ఢిల్లీ ఎయిర్ పోర్ట్ లో ఇండిగో మళ్ళీ బుక్కయ్యింది
- November 13, 2017
టైం బ్యాడ్ అంటే ఇదేనేమో! వరుస అభియోగాలతో ఇప్పటికే తలకొట్టేసినట్లయిన ఇండిగో ఎయిర్ లైన్స్ మళ్ళీ తలదించుకోవాల్సి వచ్చింది. ఢిల్లీ ఎయిర్ పోర్ట్ లో ఇండిగో విమానం దిగిన ఒక మహిళ వీల్ చైర్ లోంచి జారి కింద పడిందట. ఆదివారం ఉదయం జరిగిన ఈ ఘటనలో స్వల్ప గాయాలతో బైటపడ్డ ఆమె ఈమేరకు ఫిర్యాదు కూడా చేసింది. ఇది పూర్తిగా ఇండిగో స్టాఫ్ నిర్లక్ష్యం ఫలితమేనని 'ఎయిర్ పోర్ట్స్ అధారిటీ ఆఫ్ ఇండియా' చివాట్లు పెట్టేసింది.
కానీ.. నేల మీద పరుచుకున్న గడ్డి వల్లే వీల్ చైర్ పక్కకు ఒరిగిందని, ఇందులో తమ సిబ్బంది తప్పు ఏమీ లేదని ఇండిగో స్పోక్స్ పర్సన్ ఊర్వశి పరేఖ్ సంజాయిషీ ఇచ్చారు. సంస్థ తరపున బాధితురాలికి క్షమాపణ కూడా చెప్పుకున్నారు. గతంలో స్టార్ ఒలంపియన్ పీవీ సింధు చేసిన కామెంట్, ఆ తర్వాత మరో ప్యాసింజర్ మీద గ్రౌండ్ స్టాఫ్ ముష్టిఘాతాలకు దిగడం లాంటి ఘటనలతో 'దోషి'గా నిలబడ్డ ఇండిగో ఎయిర్ లైన్స్ కి ఇది మరో తలఒంపుల కథ!
తాజా వార్తలు
- దిబ్బా తీరంలో తొమ్మిది మంది అరెస్టు..!!
- కువైట్ లో మహిళను జైలుపాలు చేసిన సోషల్ మీడియాలో పోస్ట్..!!
- వేసవిలో కార్మికుల భద్రతపై వీడియో వైరల్..స్పందించిన WOQOD..!!
- సౌదీ విద్యార్థి అల్-ఖస్సిం హంతకుడికి యావజ్జీవ కారాగార శిక్ష..!!
- భారతీయ వ్యక్తిని చంపిన వ్యక్తులను అరెస్ట్ చేసిన షార్జా పోలీసులు..!!
- సెక్యూరిటీ, స్టేబిలిటీపై చర్చించిన సౌదీ, బహ్రెయిన్..!!
- డెలివరీ రైడర్ల కోసం ఎయిర్ కండిషన్డ్ విశ్రాంతి కేంద్రాలు సిద్ధం చేసిన RTA
- దోహాలో ఘనంగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
- భారత్‌పే అదిరిపోయే ఫీచర్..
- ఏపీ కేబినెట్ సమావేశం..అమరావతిలో ‘అమరావతి ఐ’ నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్









