ఉల్లికాడలు, పాలు సూప్
- November 14, 2017కావలసిన పదార్థాలు: ఉల్లి కాడలు - 2 కట్టలు, ఉల్లి తరుగు - పావు కప్పు, తరిగిన వెల్లుల్లి - 2 రేకలు, ఆలివ్ నూనె - 2 టీ స్పూన్లు, చిక్కటి పాలు - అరకప్పు, నీళ్లు / వెజిటెబుల్ స్టాక్ - 1 కప్పు, ఉప్పు - రుచికి తగినంత, మెదిపిన మిరియాలు - 1 టీ స్పూను.
తయారుచేసే విధానం: ఉల్లికాడల్ని శుభ్రం చేసి కింద భాగాన్ని, పై భాగాన్ని విడి విడిగా కట్ చేయాలి. ఆలివ్ నూనెలో వెల్లుల్లి, ఉల్లి, కాడల (కింద భాగం) తరుగు ఒకటి తర్వాత ఒకటి దోరగా వేగించాలి. ఇప్పుడు కాడల (పైభాగం) తరుగు వేసి రంగు మారకుండా వేగించి దించేయాలి. చల్లారిన తర్వాత పేస్టులా చేసుకుని పాలు, నీరు/ వెజిటబుల్ స్టాక్లతో కలిపి 7 నిమిషాలు మరిగించాలి. ఉప్పు, మిరియాలపొడి కలిపి నేతిలో వేగించిన బ్రెడ్ ముక్కలతో అలంకరించుకుని తాగాలి.
తాజా వార్తలు
- సిబిఎస్ఇ లో రాణించిన భారత పాఠశాల విద్యార్థులు
- మరో ఘనతకు సిద్ధమవుతున్న కువైట్ ఎయిర్ పోర్ట్..!
- సౌదీలో SR3000 గరిష్ఠ డ్యూటీ ఫ్రీ పరిమితి విధింపు
- వావ్.. దుబాయ్ కొత్త విమానాశ్రయం ఫోటోస్ ఔట్
- ఖతార్ ఎకనామిక్ ఫోరమ్ ప్రారంభం
- యూఏఈలో పురాతన నీటిపారుదల వ్యవస్థ పునరుద్ధరణ
- ఏపీలో టెన్షన్ టెన్షన్..
- ఏపీలో రికార్డు స్థాయిలో పోలింగ్..
- మెట్రో అమ్మకం పై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
- హైదరాబాద్ నెహ్రూ జూలాజికల్ పార్క్ లో మగ తెల్లపులి మృత్యువాత