జపాన్: భారతీయులకు వీసా నిబంధనల్లో సడలింపు
- November 15, 2017భారతీయులకు వీసా నిబంధనలను వచ్చే జనవరి 1వ తేదీ నుంచి సడలించాలని, తమ దేశంలో తాత్కాలిక విడిది కోసం వచ్చేవారికి 'బహుళ ప్రవేశ వీసా'లను జారీ చేయాలని జపాన్ నిర్ణయించింది. పర్యాటకులకు, వ్యాపారులకు, తరచూ వచ్చే సందర్శకుల కోసం ఈ సడలింపులు ఉంటాయని ఇక్కడి జపాన్ రాయబార కార్యాలయం మంగళవారం తెలిపింది. ఈ సడలింపులతో వీసా దరఖాస్తుల పరిశీలన ప్రక్రియ సులభతరమవడమే కాకుండా, అర్హత గల అభ్యర్థుల సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉంది. ఉపాధికి సంబంధించిన ధ్రువీకరణ, తాత్కాలిక విడిదికి కారణాలను తెలిపే లేఖలను ఇక 'బహుల ప్రవేశ వీసా'లకు సమర్పించనవసరం లేదు. పాస్‌పోర్ట్ వీసా దరఖాస్తు (అభ్యర్థి ఫొటో సహా), ఆర్థిక పరిస్థితికి సంబంధించిన పత్రం (టూరిస్టులకు), వాణిజ్య సంబంధాలకు తగిన ధ్రువీకరణ పత్రం ఉంటే సరిపోతుంది. బహుళ ప్రవేశ వీసా గరిష్ట కాలపరిమితి 5 ఏళ్లు అయినప్పటికీ జపాన్‌లో 90 రోజులకు మించకుండా తాత్కాలికంగా విడిది చేసేందుకు వీలుంటుంది. పర్యాటకం, వాణిజ్యం, వ్యాపార రంగాల్లో భారత్‌తో సంబంధాలను మరింతగా పెంచుకునేలా జపాన్ తన వీసా నిబంధనల్లో ఈ సడలింపులను ప్రకటించింది. భారతీయ విద్యార్థులకు సంబంధించి వీసా నిబంధనలను గత ఫిబ్రవరిలోనే జపాన్ సరళీకరించింది.
తాజా వార్తలు
- UPI చెల్లింపులకు దుబాయ్ డ్యూటీ ఫ్రీ ఆమోదం..!!
- ఇండియాలో ‘ఎమ్మార్’ విక్రయం..అదానీ సహా పలు గ్రూపులతో చర్చలు..!!
- 41వేల నకిలీ పెర్ఫ్యూమ్ బాటిల్స్ స్వాధీనం..!!
- కువైట్ మాజీ అధికారులకు $88 మిలియన్ల జరిమానా..!!
- దుబాయ్, అబుదాబిలో నైట్ వర్క్ పర్మిట్ ఎలా పొందాలి?
- మస్కట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్.. పెట్టుబడి అవకాశాలు..!!
- పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ఖాన్ దంపతులకు బిగ్షాక్..
- ఏపీ కేబినెట్ భేటీలో కీలక నిర్ణయాలు
- రూ.200 నోట్ల బ్యాన్ ? ఆర్బీఐ కీలక ప్రకటన
- ఖేల్రత్న పురస్కారాలను ప్రదానం చేసిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము