కేసర్ ఫిర్నీ
- November 15, 2017
కావలసిన పదార్థాలు: పాలు - ఒక లీటరు, బాస్మతి బియ్యం - నూరు గ్రాములు,పంచదార - 200 గ్రాములు, కుంకుమపువ్వు - ఒక గ్రాము, పిస్తా పొడి - ఐదు గ్రాములు, ఏలకుల పొడి - ఐదు గ్రాములు.
తయారుచేసే విధానం
బాస్మతి బియ్యాన్ని కడిగి అరగంట నానబెట్టాక, బియ్యాన్ని మిక్సీలో మెత్తగా రుబ్బుకోవాలి. రుబ్బుకున్న బియ్యానికి రెండు వందల మి.లీ. పాలు కలిపి పక్కనుంచుకోవాలి. ఒక పాత్రలో మిగిలిన పాలు పోసి స్టౌ మీద పెట్టి చిక్కబడి మూడో వంతు అయ్యేదాకా మరిగించుకోవాలి. అప్పుడు పంచదార, యాలకుల పొడి వేసి కలపండి. పంచదార కరిగిన తర్వాత పాలల్లో బియ్యం మిశ్రమాన్ని పోసి కలపాలి. బియ్యం మెత్తగా అయ్యేవరకూ ఉడికించాలి. దించేముందు పిస్తాపప్పు ముక్కల్ని, కుంకుమ పువ్వుని వేసి బాగా చల్లబరచడానికి రిఫ్రిజిరేటర్‌లో పెట్టి ఆ పైన తింటే చాలా రుచిగా ఉంటుంది
తాజా వార్తలు
- ఓటర్లకు ముఖ్య గమనిక..
- ఉత్తరకాశీ టన్నెల్ ఆపరేషన్ సక్సెస్..
- తెలంగాణ ప్రజలకు సోనియాగాంధీ కీలక సందేశం
- దుబాయ్ లో శ్రీలంక ఫుడ్ ఫెస్టివల్
- బీమా క్లెయిమ్ కావాలంటే.. కారు ఓనర్లు ఈ తప్పులు చేయకండి
- ఇతరులపై దాడి చేస్తే.. ఏడాది జైలుశిక్ష, 10,000 దిర్హామ్ల జరిమానా
- సౌదీ పర్యాటక ప్రమోషన్.. 277% పెరిగిన బుకింగ్లు
- బీచ్లో బార్బెక్యూలు.. అధికారుల హెచ్చరిక
- నవంబర్ 30న పోలింగ్ రోజు అన్ని ప్రైవేట్ సంస్థలు సెలవు ప్రకటించాలి: ఎలక్షన్ కమిషన్
- అల్ దఖిలియాలో ఘోర అగ్ని ప్రమాదం..ఒకరు మృతి