గృహ నిర్బంధంలో జింబాబ్వే అధ్యక్షుడు
- November 15, 2017
హరారే : జింబాబ్వే అధ్యక్షుడు రాబర్ట్ ముగాబే గృహ నిర్బంధంలో ఉన్నారని దక్షిణాఫ్రికా అధ్యక్షుడు జాకోబ్ జూమా వెల్లడించారు. ఈ మేరకు దక్షిణాఫ్రికా ప్రభుత్వం ఓ ప్రకటన విడుదల చేసింది. రాబర్ట్ ముగాబేతో జాకోబ్ జుమా మాట్లాడినట్టు ఈ ప్రకటనలో పేర్కొంది. తనను జింబాబ్వేలోనే గృహ నిర్బంధంలో ఉంచారని, అయితే తాను క్షేమంగానే ఉన్నానని ముగాబే చెప్పినట్టు తెలిపింది. మంగళవారం రాత్రి జరిగిన సైనిక చర్యలో రాబర్ట్ ముగాబేతోపాటు ఆయన సతీమణిని అదుపులోకి తీసుకున్నట్టు జింబాబ్వే సైన్యం బుధవారం ప్రకటించింది. ముగాబే చుట్టూ ఉన్న అవినీతిపరులపై చర్య తీసుకోవడానికే తామీ చర్యకు పాల్పడినట్టు తెలిపింది. ముగాబే చుట్టూ ఉన్నవారి అవినీతి వల్ల దేశంలో ఆర్థిక సంక్షోభం నెలకొందని ఆరోపించింది.
అధికారం కోసం తిరుగుబాటు చేయలేదు
ముగాబే అధికారాన్ని చేజిక్కించుకోవాలనే దురుద్దేశంతో తాము సైనిక చర్యకు పాల్పడలేదని జింబాబ్వే ఆర్మీ చీఫ్ జనరల్ చివెంగా తెలిపారు. ముగాబేతో తనకు వ్యక్తిగత కక్ష్యలు లేవని, దేశంలో పేట్రేగిపోయిన అవినీతిని నిర్మూలించాలన్నదే తమ ధ్యేయం అన్నారు. ముగాబే స్థానాన్ని ఎమర్సన్ నాన్గావాతో భర్తీ చేయాలని మిలిటరీ కుట్రపన్నిందని మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నను ఆయన దాటవేశారు.
హరారేలో బలగాల కవాతు : ముగాబేని గృహ నిర్బంధంలోకి తీసుకున్న తర్వాత జింబాబ్వే బలగాలు రాజధాని హరారే వీధుల్లో కవాతు నిర్వ హించాయి. స్టేట్ మీడియాను సీజ్ చేశాయి. అవినీతి అధికారులనులక్ష్యంగా దాడులు నిర్వహించనున్నట్టు ప్రకటించాయి.
ముగాబేని సైన్యం ఎందుకు నిర్బంధించిందంటే...
జింబాబ్వే 1980లో స్వతంత్య్ర రాజ్యంగా అవతరించింది. బ్రిటన్ నుంచి స్వాతంత్య్రం పొందిన అనంతరం ముగాబే దేశాధ్యక్ష పగ్గాలు చేపట్టారు. అప్పటి నుంచి ఆయనే అధ్యక్ష పదవిలో కొనసాగుతున్నారు. మూడున్నర దశా బ్దాలకు పైగా ఆయన పాలనలో ప్రజలు విసిగి పోయారు. పైగా, జింబాబ్వేలో అవినీతి రాజ్య మేలుతోందని సైన్యం ఆరోపిస్తున్నది. జింబాబ్వేలో చోటుచేసుకున్న పరిణా మాలను నిశితంగా పరిశీలిస్తున్నట్టు అమెరికా పేర్కొన్నది. జింబాబ్వే లో తలెత్తిన అంతర్గత సమస్యలను శాంతి యుతంగా పరిష్కరించుకోవాలని కోరింది. ఆ దేశంలో తలెత్తిన అనిశ్చిత పరిస్థితుల కారణంగా జింబాబ్వేలోని యూఎస్ రాయబారి కార్యా లయాన్ని తాత్కాలికంగా మూసివేసినట్టు తెలిపింది.
తాజా వార్తలు
- ప్రధాని మోదీకి ‘ఆర్డర్ ఆఫ్ ఒమన్’ పురస్కారం
- 40 మంది సభ్యులతో గవర్నర్ను కలవనున్న జగన్
- మిసెస్ ఎర్త్ ఇంటర్నేషనల్-2025గా విద్యా సంపత్
- న్యాయ వ్యవస్థలో ఓ దురదృష్టకరమైన ట్రెండ్ నడుస్తోంది: చీఫ్ జస్టిస్ సూర్యకాంత్
- కొత్త ఏఐ ఫీచర్.. వాయిస్ మెసేజ్లు ఇక టెక్ట్స్లో!
- వచ్చే ఏడాది అక్టోబర్ వరకు హెచ్-1బీ వీసా వాయిదా
- ఖతార్ అర్దాలో ఆకట్టుకున్న అమీర్..!!
- భారత్-సౌదీ మధ్య పరస్పర వీసా మినహాయింపు..!!
- యూఏఈలో భారీ వర్షాలు, వడగళ్లతో బీభత్సం..!!
- ముబారక్ అల్-కబీర్లో వాహనాలు స్వాధీనం..!!







