భారీగా ఒంటె మాంసం తరలింపు...పట్టుకున్న పోలీసులు
- November 15, 2017
నల్గొండ: నల్గొండ జిల్లాలో ఒంటె మాంసాన్ని తరలిస్తున్న లారీలను స్థానికుల సహకారంతో పోలీసులు అడ్డుకున్నారు. మునుగోడు మండలం ఊకొండి గ్రామ శివారులో ఓ రైతు పొలం దగ్గర గుర్తు తెలియని దుండగులు ఒంటెలను వధించారు. నాలుగు లారీల్లో 30 ఒంటెలను ఇటీవల తీసుకొచ్చారు. అనంతరం వాటిని బుధవారం అర్ధరాత్రి కోసి 4 డీసీఎం వ్యాన్లలో 20 క్వింటాళ్లకు పైగా ఒంటె మాంసాన్ని హైదరాబాద్‌కు లారీల్లో తరలించడానికి ప్రయత్నించారు. ఇది గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే అక్కడకు చేరుకున్న పోలీసులు మాంసం తరలిస్తున్న లారీలను అడ్డుకున్నారు. అనంతరం ఈ మాంసం వ్యవహారంతో సంబంధం ఉన్న 30 మందిని అదుపులోకి తీసుకున్నారు.
తాజా వార్తలు
- 171 దేశాల పౌరులకు భారత్ ఈ-వీసా సౌకర్యం
- దూసుకొస్తోన్న 'భారత్ ట్యాక్సీ'
- ఎస్.పీ.బాలసుబ్రహ్మణ్యం సినీ గానప్రస్థానానికి 60 ఏళ్లు
- గుంటూరులో NATS ఆధ్వర్యంలో జానపద సాంస్కృతిక సంబరాలు
- సాజిద్ అక్రమ్‌పై స్పష్టత ఇచ్చిన తెలంగాణ డీజీపీ
- భారత విమానాశ్రయాల్లో రూ.1 లక్ష కోట్లు పెట్టుబడి
- ఖతార్‌లో భారీగా తగ్గనున్న ఉష్ణోగ్రతలు..!!
- రియాద్‌లో 84% తక్కువ ధరకే రెసిడెన్సీ ప్లాట్ లు..!!
- రస్ అల్ ఖైమాలో భారత కార్మికుడు మృతి..!!
- కువైట్, భారత్ సంబంధాలు బలోపేతం..!!







