ఒత్తిడి బారిన పడేస్తున్నసామాజిక మాధ్యమాలు

- November 15, 2017 , by Maagulf
ఒత్తిడి బారిన పడేస్తున్నసామాజిక మాధ్యమాలు

ఈ కాలం పిల్లలు వీలైనంత ఎక్కువ సమయాన్ని స్మార్ట్‌ఫోన్లు, ఎలక్ట్రానిక్‌ పరికరాలతోనే గడిపేస్తున్నారు. అయితే రోజులో 5 గంటల సమయం వీటితో గడిపేవాళ్లు మానసికంగా కుంగిపోతారంట. దీంతో వారిలో ఆత్మహత్య చేసుకోవాల న్న భావన కలుగుతుందట. మరీ ముఖ్యంగా అమ్మాయిల్లో ఎక్కువగా ఇది కనిపిస్తోందని శాన్‌డిగో స్టేట్‌ యూనివర్సిటీకి చెందిన ఓ బృందం చేపట్టిన ఓ అధ్యయనంలో వెల్లడైంది. యూనివర్సిటీకి చెందిన పలువురు నిపుణులు.. 14 ఏళ్లలోపు వయసున్న సుమారు లక్ష ముప్పై వేలకు మంది అమ్మాయిలను పరీక్షించారు. ఈ అధ్యయనంలో వారికి విస్తుపోయే నిజాలు తెలిశాయి.
సామాజిక మాధ్యమాలైన ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌ కోసం అమ్మాయిలు వీలైనంత ఎక్కువ సమయాన్ని కేటాయిస్తున్నారు. తాము చేసిన పోస్టులకు, ఫొటోలకు ఎన్ని లైక్స్‌, కామెంట్స్‌ వచ్చాయి, మనల్ని ఎందరు ఫాలో అవుతున్నారు తదితర అంశాలను గమనిస్తుంటారు. వారు వూహించిని రీతిలో స్పందన కరువైతే తీవ్ర నిరాశకు గురవుతున్నారు. అంతేకాదు ఇతరులను ఎక్కువగా ఆకర్షించలేపోతున్నామే అంటూ ఆవేదన చెందుతున్నారు. దీంతో మానసికంగా కుంగిపోయి.. ఆత్మహత్య చేసుకోవాలన్న ఆలోచనలకు తెర తీస్తున్నారు. విరామం లేకుండా యూట్యూబ్‌ వీడియోలను చూస్తే ఈ రిస్క్‌ మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు వెల్లడించారు.
అబ్బాయిలతో పోలిస్తే అమ్మాయిలే ఎక్కువగా స్మార్ట్‌ఫోన్లు వాడుతున్నట్లు ఈ అధ్యయనంలో తేలింది. అబ్బాయిలు ఎక్కువగా గేమ్స్‌ ఆడేందుకే ఫోన్లు వాడుతున్నారట.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com