పెద్ద డెసిషన్ తీసుకున్న ప్రభాస్ హీరోయిన్

- November 16, 2017 , by Maagulf
పెద్ద డెసిషన్ తీసుకున్న ప్రభాస్ హీరోయిన్

బాలీవుడ్ హాట్ బ్యూటీ శ్రద్ద కపూర్..ఇండస్ట్రీ కి వచ్చిన అతి తక్కువ టైం లోనే తనకంటూ అభిమానులను సొంతం చేసుకొని వరుస హిట్స్ అందుకొని క్రేజ్ స్టార్ అయ్యింది. తాజాగా తెలుగు లో ప్రభాస్ సరసన సాహో మూవీ తో టాలీవుడ్ కు పరిచయం కాబోతుంది. సుజిత్ దర్శకత్వం లో తెరకెక్కుతున్న ఈ మూవీ ను యూవీ క్రియేషన్స్ బ్యానర్ వారు భారీ బడ్జెట్ తో తెలుగు , తమిళ్ , హిందీ భాషల్లో నిర్మిస్తున్నారు.
తాజాగా శ్రద్ద ఓ కఠిన నిర్ణయం తీసుకుందట. ఎక్కువగా నాన్-వెజ్ ను ఇష్టపడే ఈ భామ ఇకపై దానిజోలికి పోకూడదని ఫిక్స్ అయ్యిందట. 2018 నుంచి నాన్ వెజ్ మానేసేందుకు ప్రయత్నిస్తానని.. సోషల్ మీడియా ద్వారా తెలిపింది. సడెన్ గా ఈ నిర్ణయం తీసుకోవడం వెనుక అసలు కారణం పెటా సంస్థ. పెటా సంస్థ నుంచి వెజిటేరియన్ లోనే నాన్ వెజ్ కు ధీటుగా ఉండే వంటకాల రెసిపీలతో పెటా సంస్థ ఓ పుస్తకాన్ని ఈమెకు పంపిందట. దీంతోపాటే జంతు సంరక్షణపై క్లాసులు కూడా ఉంటాయనే సంగతి తెలిసిందే. అన్నిటిపై తెగ థింక్ చేసేసిన శ్రద్ధా కపూర్.. వచ్చే ఏడాది నుంచి మాంసాహారం మానేయాలని ఫిక్స్ అయిపోయిందట.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com