గుడ్డు కాకర పొరటు
- November 16, 2017కావలసిన పదార్థాలు: కాకరకాయ (చిన్నది) - 1, గుడ్లు - 5, ఉల్లి తరుగు - 2 టీ స్పూన్లు, పండు మిర్చి తరుగు - 1 టీ స్పూను, (పల్చటి) సోయాసాస్ - 1 టీ స్పూను, ఉప్పు, మిరియాలపొడి - రుచికి తగినంత, వేరుశనగ నూనె - 2 టేబుల్ స్పూన్లు.
తయారుచేసే విధానం: కాకరకాయని సన్నగా తరిగి, గింజలు తీసి ఉప్పు నీటిలో 10 నిమిషాలు ఉంచి, నీటిని వార్చేసి ఆరబెట్టాలి. గుడ్ల సొనలో సోయాసాస్, ఉప్పు, మిరియాలపొడి వేసి బాగా గిలకొట్టి పక్కనుంచాలి. కడాయిలో కాకర, ఉల్లి, పండుమిర్చి తరుగులు ఒకదాని తర్వాత ఒకటి వేగించి గుడ్ల మిశ్రమం కలపాలి. ఎక్కువసేపు వేగించకుండా దించేసి వేడివేడిగా అన్నంతో తింటే చాలా రుచిగా ఉంటుంది.
తాజా వార్తలు
- ఏప్రిల్ లో 20 వేల మందిని తీసేసిన టెక్ దిగ్గజాలు..!
- ఏపీ: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్..
- రాజస్థాన్ రాయల్స్ పై సన్ రైజర్స్ దే విజయం
- నీట్ యూజీ 2024 ఎంట్రన్స్ ఎగ్జామ్ అడ్మిట్ కార్డ్లు విడుదల..
- టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సన్రైజర్స్ హైదరాబాద్
- టీఎస్ఆర్టీసీ ఎండీతో బ్రిటిష్ డిప్యూటీ హైకమిషనర్ భేటీ
- ఏపీలో 46,389 పోలింగ్ కేంద్రాలు..
- యూఏఈలో అనేక విమానాలు దారి మళ్లింపు, రద్దు
- AI సహాయంతో విద్యార్థుల ప్రొగ్రెస్ ట్రాక్..!
- సౌదీలో మహిళలకు డ్రైవింగ్ లైసెన్స్..!