ట్రాఫిక్ జరీమానాల్లో 50 శాతం డిస్కౌంట్: పరిమిత కాలానికే
- November 17, 2017
ఉమ్ అల్ కువైన్, పరిమిత కాలానికిగాను 50 శాతం డిస్కౌంట్ని ట్రాఫిక్ జరీమానాలపై ప్రకటించింది. నవంబర్ 19న ప్రారంభమయ్యే ఈ ఆఫర్, 42 రోజుల్లో ముగస్తుంది. నవంబర్ 19 నుంచి డిసెంబర్ 31 వరకు చెల్లింపులు చేస్తే 50 శాతం డిస్కౌంట్ లభిస్తుంది గనుక, ఈ ఆఫర్‌ని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలనీ, నేషనల్ డే సెలబ్రేషన్స్‌లో భాగంగా ఈ ఆఫర్‌ని ప్రకటించామని యుఎక్యూ ట్రాఫిక్ పోలీస్ డిప్యూటీ డైరెక్టర్ కల్నల్ హుమైద్ అహ్మద్ సయీద్ అల్ అలి చెప్పారు. వాహనదారుల ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నామనీ, ఆర్థిక భారం తగ్గించడంలో భాగంగానే డిస్కౌంట్స్ ప్రకటించామని అధికారులు పేర్కొన్నారు. ఇంకో వైపున రస్ అల్ ఖైమా ట్రాఫిక్ జరీమానాల డిస్కౌంట్‌కి సంబంధించి గడువుని డిసెంబర్ 2 వరకు పొడిగించిన సంగతి తెలిసినదే.
తాజా వార్తలు
- కువైట్‌లో ఉగ్రవాద నిధుల కుట్ర భగ్నం: 24 మంది అరెస్ట్
- ఢిల్లీ క్యాపిటల్స్ పై చెన్నై సూపర్ కింగ్స్ విజయం
- మే 10 ఎన్టీఆర్ ట్రస్ట్ తలసేమియా రన్‌కు నారా భువనేశ్వరి పిలుపు
- ప్రాంతీయ భద్రత పై యూఏఈ–భారత్ విదేశాంగ మంత్రుల కీలక చర్చలు
- కీసర టోల్‌ప్లాజా వద్ద ఘోర ప్రమాదం
- ఆ వార్తలు వేదనకు గురిచేశాయి: దర్శకుడు వేణు ఉడుగుల
- నార్సింగి పోలీస్ స్టేషన్లో సింగర్ మంగ్లీ ఫిర్యాదు
- గాయని ఆశా భోస్లేకు గుండెపోటు..ఆసుపత్రికి తరలింపు
- అమేజాన్ సమ్మర్ సేల్..
- ఏఐ ఎయిర్పోర్ట్ సర్వీసెస్‌లో ఉద్యోగాలు..









