'తెలుగు తరంగిణి' కార్తీక వన భోజనాలు
- November 18, 2017
రస్ అల్ ఖైమా: తెలుగు తరంగిణి వారి ఆర్ధ్వర్యంలో హేవలంబి నామ సంవత్సర కార్తీక వన భోజనాలు రస్ అల్ ఖైమా సక్కర్ పార్క్ లో నవంబర్ 17న ఉత్సాహంగా జరుపుకున్నారు.
అధ్యక్షులు సురేష్ ఆర్ధ్వర్యంలో తరంగిణి సభ్యులు ప్రశాంతి, శోభ, రసూల్, బిందు, లక్ష్మి మరియు లలిత ఆటల నిర్వహణ బాధ్యతలు చూసుకున్నారు. నందా, రాజేష్, రవిశంకర్, వేణు, వెంకీ, కిరణ్, శ్రీనివాస్, వీర, మోహన్, సైద రెడ్డి మరియు ఇతర సభ్యులు కార్యక్రమ ఏర్పాట్లు చూసుకున్నరు. సుజన్, మైథిలి ఏంకర్లుగా వ్యవహరించారు. శ్రీ మహేష్ ప్రభు, శ్రీ ధర్మరాజు కార్తీక వనభోజనాల ప్రాముఖ్యత గురించి వివరించారు.
ప్రముఖ పారిశ్రామికవేత్త శ్రీ దువ్వురి కిషోర్ బాబు ఆహార ఫలహరాదులు స్పాన్సర్ చేశారు.APNRT కో-ఆర్డినేటర్స్ వొబ్బిలిసెట్టి అనూరాధ,సుధాకర్ సింగిరి,సత్యనారాయణ గెద్దాడ పాల్గొని APNRT Membership నమోదు కార్యక్రమాన్ని చేపట్టారు .
సుమారు 400 మంది తెలుగువారు ఆట, పాటలతో సాంప్రదాయ తెలుగు విందు భోజనాలతో ఆనందంగా గడిపారు.
తెలుగు తరంగిణి తదుపరి కార్యక్రమం "సంక్రాంతి సంబరాలు" 12 జనవరి 2018 న ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలియచేసారు.
ఈ కార్యక్రమానికి మాగల్ఫ్ మీడియా సహకారాన్ని అందించింది.





తాజా వార్తలు
- త్వరలో వెబ్‌లో గ్రూప్ వీడియో, ఆడియో కాల్స్ సౌకర్యం
- దావోస్ కు బయల్దేరిన చంద్రబాబు, రేవంత్ రెడ్డి
- స్పెయిన్ లో ఘోర రైలు ప్రమాదం.. 21 మంది మృతి
- ఎన్ఆర్ఐ టీడీపీ బహ్రెయిన్ ఆధ్వర్యంలో ఎన్టిఆర్ 30వ వర్ధంతి
- అవాలి అభివృద్ధి మాస్టర్ ప్లాన్ పై కింగ్ హమద్ సమీక్ష..!!
- యూఏఈ దిర్హమ్కు రూ.25కు చేరువలో భారత రూపాయి..!!
- విదేశీ వాహనదారులకు ఖతార్ గుడ్ న్యూస్..!!
- రియాద్ లో దక్షిణ యెమెన్ నాయకులు..కీలక ప్రకటన..!!
- కువైట్ ‘లులు’లో బ్రిటిష్ డెయిరీ ప్రొడక్ట్స్ వీక్..!!
- ఒమన్‌లో 8.5% పెరిగిన బ్యాంకు లోన్లు..!!







