'కణం' ట్రైలర్ విడుదల.!
- November 18, 2017
నాగశౌర్య, సాయిపల్లవి జంటగా నటించిన చిత్రం 'కణం'. ఎ.ఎల్. విజయ్ దర్శకత్వం వహిస్తున్నారు. లైకా ప్రొడక్షన్ సంస్థ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈ సినిమా ట్రైలర్‌ను శనివారం విడుదల చేశారు. సస్పెన్స్‌తో కూడిన సన్నివేశాలతో ట్రైలర్‌ను అద్భుతంగా తీర్చిదిద్దారు. 'మా సారీ మా. నేను చేసింది తప్పే. అలా అని ఇది వద్దమ్మా.. ప్లీజ్' అనే డైలాగ్‌తో.. నాగశౌర్య, సాయిపల్లవి పెళ్లితో ట్రైలర్ ప్రారంభమైంది. 'కృష్ణ నేను చెప్పేది వింటే నీకు ఆశ్చర్యంగా ఉండొచ్చు. నువ్వు నమ్మలేకపోవచ్చు. కానీ అది నిజం.. నువ్వు అన్ని మర్చిపోగలవేమో కానీ నేను మర్చిపోలేను' అంటూ సాయిపల్లవి నాగశౌర్యతో అంటూ కనిపించారు. ఎవరో హత్యకు గురి కావడం, హంతకుడి కోసం పోలీసులు గాలించడం, ఇంటిలో పూజలు చేయడం..
తదితర సన్నివేశాలతో కూడిన ఈ ట్రైలర్ సినిమాపై ఆసక్తిని రేకిత్తిస్తోంది. ఓ పాప చుట్టూ ఈ సినిమా కథ సాగేలా తెలుస్తోంది. 'కణం' చిత్రానికి సీఎస్ సామ్ స్వరాలు అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని తమిళంలో 'కరు' అనే టైటిల్‌తో విడుదల చేయబోతున్నారు. సాయిపల్లవి 'ఫిదా' చిత్రంతో తెలుగులో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రస్తుతం ఆమె నాని సరసన 'ఎం.సి.ఎ' చిత్రంలో నటిస్తున్నారు. నాగశౌర్య 'ఛలో' చిత్రం షూటింగ్‌లో బిజీగా ఉన్నారు.
తాజా వార్తలు
- అవాలి అభివృద్ధి మాస్టర్ ప్లాన్ పై కింగ్ హమద్ సమీక్ష..!!
- యూఏఈ దిర్హమ్కు రూ.25కు చేరువలో భారత రూపాయి..!!
- విదేశీ వాహనదారులకు ఖతార్ గుడ్ న్యూస్..!!
- రియాద్ లో దక్షిణ యెమెన్ నాయకులు..కీలక ప్రకటన..!!
- కువైట్ ‘లులు’లో బ్రిటిష్ డెయిరీ ప్రొడక్ట్స్ వీక్..!!
- ఒమన్‌లో 8.5% పెరిగిన బ్యాంకు లోన్లు..!!
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!







