కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఎన్నికలకు షెడ్యూలు విడుదల

- November 20, 2017 , by Maagulf
కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఎన్నికలకు షెడ్యూలు విడుదల

ఢిల్లీః కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ అధ్యక్షతన సమావేశమైన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) సమావేశం కీలక నిర్ణయం తీసుకుంది. తదుపరి కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికకు నోటిఫికేషన్ విడుదల చేయాలని నిర్ణయించింది. రేపు నోటిఫికేషన్ విడుదల చేస్తామని, నామినేషన్ల దాఖలుకు ఈ నెల 24 చివరి తేదీ అని సీడబ్ల్యూసీ ప్రకటించింది. డిసెంబర్ 1 వరకూ నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉంటుందని, డిసెంబర్ 8న కాంగ్రెస్ అధ్యక్షుడి ఎన్నిక, 11న ఫలితాలను వెల్లడిస్తామని తెలిపింది. ఇక ఈ ఎన్నికల్లో రాహుల్ మినహా మరెవరైనా నామినేషన్ వేస్తారని భావించడం లేదని, ఆయన ఎన్నిక ఏకగ్రీవమే అవుతుందని సీనియర్ కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. పార్టీలోని ప్రజాస్వామ్య సంప్రదాయాన్ని కొనసాగించాలని భావించిన క్రమలోనే ఎన్నికల షెడ్యూల్ ప్రకటించినట్టు వారు స్పష్టం చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com