హీరో శివాజీ అరెస్ట్
- November 20, 2017
ఏపీ కి ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ.. సోమవారం ఉదయం ప్రతిపక్ష, విపక్ష నేతలు ఆందోళన చేపట్టారు. ఇందులో భాగంగానే వీరంతా ' ఛలో అసెంబ్లీ ర్యాలీ' నిర్వహించారు. కాగా.. ఈ రోజు తెల్లవారు జామున పలువురు నేతలను పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టు అయిన వారిలో ప్రత్యేక హోదా సాదన సమితి సంఘ నేతలు చలసాని శ్రీనివాసరావు, సినీ హీరో శివాజీ తదితరులు ఉన్నారు. ఈ విషయంపై హీరో శివాజీ మాట్లాడుతూ.. తాము ప్రశాంతంగా ఛలో అసెంబ్లీ కార్యక్రమం చేద్దామనుకున్నామని.. సీఎం దానిని అడ్డుకోవడం మంచి నిర్ణయం కాదన్నారు. అభివృద్ధి పేరుతో చంద్రబాబు రాష్ట్ర ప్రజలను మోసం చేస్తున్నారని ఆరోపించారు. ఈ మూడున్నరేళ్లలో రాష్ట్రంలో కొంచెం కూడా అభివృద్ధి జరగలేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







