నరేంద్రమోదీకి ఘన స్వాగతం పలికిన లండన్
- November 12, 2015
మూడు రోజుల యూకే పర్యటనలో భాగంగా బయలుదేరిన భారత ప్రధాని నరేంద్రమోదీ లండన్ చేరుకున్నారు. ప్రత్యేక విమానంలో లండన్ చేరుకున్న మోదీని ఏయిర్ పోర్టులో అక్కడి అధికారులు ఘన స్వాగతం పలికారు. ఈ పర్యటనలో వాణిజ్య, ఆర్థిక, రక్షణ, విద్యుత్ రంగాల అభివృద్ధితోటు ఉగ్రవాదం, వాతావరణంలో మార్పుపైనా ఇంగ్లాండ్ ప్రధాని డెవిడ్ కెమెరూన్ తో చర్చించనున్నారు. దశాబ్దం తర్వాత యూకేలో పర్యటిస్తున్న తొలి భారత ప్రధాని అయిన మోదీ.. ఆర్థిక సహకారంపైనే ఎక్కువగా దృష్టి పెట్టారు. ఈ పర్యటనలో మోదీ.. బ్రిటన్ ప్రధాని కెమెరూన్ తో చర్చలతో పాటు.. బ్రిటన్ పార్లమెంటులో, ప్రవాస భారతీయులు వెంబ్లీ స్టేడియంలో ఏర్పాటు చేసిన సమావేశంలోనూ ప్రసంగించనున్నారు.
తాజా వార్తలు
- దుబాయ్ ఎయిర్‌పోర్ట్‌లో ఎటువంటి ప్రమాదాలు జరగలేదు: వదంతులను కొట్టిపారేసిన అధికారులు!
- అనుమతి లేకుండా ధరలు మారిస్తే.. QR1,000,000 ఫైన్..!!
- డ్రైవింగ్ చేసేటప్పుడు అత్యవసర హెచ్చరిక వస్తే?
- ఇరాన్ దురాక్రమణ..బహ్రెయిన్‌కు నాటో మద్దతు..!!
- గల్ఫ్ దేశాలపై ఇరాన్ దాడులు నేపథ్యంలో TGWWC–ఒమాన్ శాఖ అత్యవసర సమావేశం
- నేషనల్ వాటర్ కంట్రోల్ సెంట్రల్ ను సందర్శించిన పీఎం..!!
- ఆఫ్రికన్, మధ్య ఆసియా దేశాలతో ఒమన్ చర్చలు..!!
- రియాద్, జెడ్డా నుండి దుబాయ్ కు ఫ్లైట్స్ పునరుద్ధరణ..!!
- దుబాయ్ లో పబ్లిక్ సేఫ్టీపై కొత్త చట్టం..Dh2 మిలియన్ల ఫైన్..!!
- షార్లెట్‌లో NATS ఆధ్వరంలో మహిళా దినోత్సవ వేడుకలు









