సౌదీ అరేబియా ఎడారిలో వింత రాతి కట్టడాలు
- November 20, 2017
రియాద్: ' ఈ నల్లని రాళ్ళలో..ఏ కన్నులూ దాగినో ...ఈ బండల మాటున... ఏ గుండెలు మోగినో ' అంటూ సౌదీ పురాతత్వ శాస్త్రవేత్తలు అమరశిల్పి జక్కన మాదిరిగా కూనిరాగాలు తీస్తున్నారు. వారి ఆసక్తికి అసలు కారణమేమిటంటే...ఎటూ చూసినా భారీ ఇసుక గుట్టలు..మొక్క మోడు మొలవని ఆ సౌదీ అరేబియా ఎడారిలో కొన్ని రాళ్లతో ఒక క్రమ పద్ధతిలో పేర్చబడిన నిర్మాణాలు వారికి ఎంతో వింతను కలిగిస్తున్నాయి. అవి ఏమిటో తెలియక సౌదీ పురాతత్వ శాస్త్రవేత్తలు తలలు పెట్టుకొంటున్నారు. ఈ రహస్యం కనిపట్టేందుకు వారు చేయని ప్రయత్నం అంటూ లేదు. కానీ, ఆ మిస్టరీ వీడటం లేదు. ఇక వారికి అంతర్జాలంలో గూగుల్ తల్లి శరణమైంది. గూగుల్ మ్యాపింగ్ ద్వారా వాటిని గుర్తించారు. ఏవో రాళ్లు శ్రద్ధగా పేర్చినట్లు కనపడుతున్న ఆ ఆకారంలో ఏదో దేవ రహస్యం దాగుందని..అవి ఏ కాలానికి చెందినవని... ఆ రాళ్ళ వరుసలను పేర్చినవారు ఎవరై ఉంటారో తేల్చుకునేందుకు ఆస్ట్రేలియాకు చెందిన డాక్టర్ డేవిడ్ కెన్నడీ అనే ప్రముఖ పురాతత్వవేత్తను అధికారులు ప్రత్యేకంగా సౌదీకి రప్పించారు. ఆయన తన బృందం సహయంతో ఆ నిర్మాణాలపై పరిశోధనలు జరిపారు. ఆ రాళ్లు 9 వేల ఏళ్ల క్రితం అలా పేర్చాబడ్డాయని కెన్నడీ తేల్చేశారు. అయితే అవి ఆనాటి మానవుల సమాధులు అయి ఉండవచ్చని కెన్నడీ అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
తాజా వార్తలు
- యూఏఈ నివాసులకు గుడ్ న్యూస్..Nol ట్రావెల్ కార్డుతో కారు అద్దెపై 40% వరకు డిస్కౌంట్
- భద్రాద్రిలో త్వరలో కొత్త విమానాశ్రయం: కేంద్ర మంత్రి
- గ్లోబల్ నాలెడ్జ్ హబ్‌గా హైదరాబాద్..
- ఉక్రెయిన్ పై రష్యా క్షిపణుల దాడి.. 12 మంది మృతి!
- వాహనాల మధ్య సేఫ్ డిస్టెన్స్.. ఉల్లంఘనకు SR300 ఫైన్..!!
- జీసీసీ దేశాల మధ్య ఆరోగ్య రంగంలో సహకారం బలోపేతం..!!
- ఖతార్‌లో చర్మవ్యాధులకు అధునాతన చికిత్సలు..!!
- ఫర్వానియాలో అగ్నిప్రమాదం.. పలు వాహనాలు దగ్ధం..!!
- ఒమన్‌లో విద్యార్థుల ఆన్లైన్ బదిలీ సేవలు పునరుద్ధరణ..!!
- అబుదాబి అద్దె నిబంధనలతో అద్దెదారులకు ఊరట..!!







