ఉబర్‌కు షాక్..హ్యాకర్ల టోకరా
- November 21, 2017
శాన్‌ఫ్రాన్సిస్కో: ప్రముఖ క్యాబ్ సర్వీస్ సంస్థ ఉబర్‌కు హ్యాకింగ్ షాక్ తగిలింది. సంస్థకు చెందిన 57 మిలియన్ల రైడర్లు, డ్రైవర్ల వ్యక్తిగత డేటాను హ్యాకర్లు దొంగలించినట్లు ఉబర్ వెల్లడించింది. ఏడాది పాటు హ్యాక్ చేసి ఈ డేటాను తీసుకున్నట్లు తెలుస్తోంది. హ్యాకింగ్ విషయాన్ని ఉబర్ సీఈవో డారా ఖోస్రోషాహి కూడా ధ్రువీకరించారు. ఇలా జరగకుండా ఉండాల్సింది. దీన్ని మేం సహించం అని డారా అన్నారు.
సంస్థ క్లౌడ్ సర్వర్‌ను హ్యాక్ చేసి డేటాను దొంగలించినట్లు డారా తెలిపారు. హ్యాక్ అయిన డేటాలో రైడర్ల పేర్లు, ఈమెయిల్ అడ్రస్‌లు, ఫోన్ నంబర్లతో పాటు డ్రైవర్ల పేర్లు, వారి లైసెన్స్‌ల వివరాలు ఉన్నట్లు ఉబర్ పేర్కొంది. కాగా.. హ్యాకింగ్ గురించి కొన్ని రోజుల క్రితమే మాజీ సీఈవో, ఉబర్ సహా వ్యవస్థాపకుడు ట్రావిక్ కలోనిక్‌కు తెలిసిందట. అయితే సీఈవో అధికారికంగా ప్రకటించేవరకు విషయాన్ని బహిర్గతం చేయలేదని సంబంధిత వర్గాలు తెలిపాయి.
అంతేగాక.. హ్యాకర్లతో ఉబర్ చర్చలు కూడా జరిపిందట. దొంగలించిన రైడర్లు, డ్రైవర్ల సమాచారాన్ని డిలీట్ చేసేందుకు ఉబర్ సదరు హ్యాకర్లకు 1,00,000 డాలర్లు చెల్లించినట్లు సమాచారం. ప్రస్తుతం సమాచారమంతా సురక్షితంగా ఉందని సీఈవో డారా అన్నారు. ఇకపై డ్రైవర్లు, రైడర్ల డేటాకు మరింత భద్రత అందించేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు.
తాజా వార్తలు
- ఎయిర్ ఇండియా ఫ్లైట్: ప్రయాణికుడు చేసిన పనికి హడలి పోయిన పైలట్..
- న్యూఢిల్లీలో IEC వార్షిక సమావేశంలో పాల్గొన్న ఖతార్..!!
- పాలస్తీనాను గుర్తించిన యూకే, కెనడా, ఆస్ట్రేలియా, పోర్చుగల్..!!
- యూఏఈలో ఆన్లైన్ ఫుడ్ డెలివరీలను నిషేధించిన స్కూల్స్..!!
- నివాస ప్రాంతాలలో బ్యాచిలర్ హౌసింగ్.. కఠిన చర్యలు..!!
- మసాజ్ పార్లర్ల ద్వారా మనీలాండరింగ్..!!
- స్వదేశానికి తిరిగి వచ్చిన సయ్యిద్ బిలారబ్..!!
- షేక్ హ్యాండ్ ఇద్దాం రండీ..టీమ్ఇండియా ఆటగాళ్లను కోరిన గంభీర్
- తెలంగాణ నుంచి మరో 2 వందేభారత్ రైళ్లు
- జీఎస్టీ 2.0పై సీఎం చంద్రబాబు స్పందన..