మహిళల ముందు అర్ధనగ్న ప్రదర్శన: వ్యక్తికి జైలు

- November 22, 2017 , by Maagulf
మహిళల ముందు అర్ధనగ్న ప్రదర్శన: వ్యక్తికి జైలు

వేర్వేరు ఘటనల్లో ఇద్దరు మహిళల ముందు ఓ వ్యక్తి అర్ధనగ్నంగా వెకిలి చేష్టలు చేయడం, వారిని అవమానించేలా తన శరీరమ్మీదే అసభ్యకరంగా తాకడం వంటి పనులు చేసినందుకుగాను 35 ఏళ్ళ పాకిస్తానీ వ్యక్తికి జైలు శిక్ష విధించింది. సెప్టెంబర్‌ 20న ఓ ఘటన చోటు చేసుకుంది. జర్మన్‌ మహిళ జాగింగ్‌ చేస్తూ, ఆ వ్యక్తిని డైరెక్షన్స్‌ అడగ్గా ఆమెతో ఆ వ్యక్తి అసభ్యకరంగా ప్రవర్తించాడు. ఆమె ఏడుస్తూ, పోలీసులను ఆశ్రయించగా అప్పటికే ఆ వ్యక్తి అక్కడి నుంచి కారులో పారిపోయాడు. అదే ప్రాంతంలో రెండ్రోజులతర్వాత నిందితుడు మరో మహిళతో అసభ్యకరంగా ప్రవర్తించాడు. ఈసారి బాధితురాలు భారతీయ మహిళ అయ్యింది. బాధితులు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు నేపథ్యంలో నిందితుడ్ని పోలీసులు పట్టుకున్నారు. బాధితులు ఇద్దరూ నిందితుడ్ని గుర్తించారు. అయితే తొలుత నిందితుడు మాత్రం తనపై వచ్చిన ఆరోపణల్ని ఖండించాడు. అయితే విచారణలో నిందితుడు నేరం అంగీకరించడమే కాకుండా, పలువురితో ఇలాగే ప్రవర్తించినట్లు ఒప్పుకున్నాడు. దాంతో అతనికి ఆరు నెలల జైలు శిక్ష విధించింది న్యాయస్థానం. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com