జింబాబ్వే అధ్యక్షుడిగా ఎమ్మార్సన్ మనాంగ్వా
- November 22, 2017
హరారె : జింబాబ్వే అధ్యక్ష పదవికి రాబర్ట్ ముగాబె రాజీనామా చేసిన నేపథ్యంలో మాజీ ఉపాధ్యక్షుడు ఎమ్మార్సన్ మనంగ్వా అధ్యక్షుడవుతారని భావిస్తున్నారు. ప్రవాసంలో వున్న మనాంగ్వా బుధవారం స్వదేశానికి తిరిగి వచ్చారని పాలక పార్టీ జను-పిఎఫ్ నాయకులు తెలిపారు. ఈ నెల ఆరంభంలో మనంగ్వాను తొలగించిన నేపథ్యంలో దేశంలో సంక్షోభం ప్రారంభమైంది. వెంటనే సైన్యం అధికారాన్ని స్వాధీనం చేసుకోవడం, చివరగా ముగాబె గద్దె దిగడానికి దారి తీసింది. కాగా పదవి నుండి తొలగించిన వెంటనే భద్రతా భయంతో మనంగ్వా (75) జింబాబ్వే నుండి వెళ్ళిపోయారు. బుధవారం మధ్యాహ్నం తిరిగివచ్చిన ఆయన గురువారం అధ్యక్ష బాధ్యతలు చేపట్టే అవకాశాలు వున్నాయని పార్టీ వర్గాలు తెలిపాయి. వచ్చే ఏడాది ఆయన అధ్యర్యంలోనే ఎన్నికలు జరిగే అవకాశం వుంది. ముగాబెను అభిశంసన క్రమాన్ని పార్లమెంట్ చేపట్టిన వెంటనే ఇటు ముగాబె రాజీనామా చేశారు. దాంతో ప్రజలు ఆనందంతో వీధుల్లో నృత్యాలు చేశారు.
--నేడు బాధ్యతలు చేపట్టే అవకాశం
తాజా వార్తలు
- ముగ్గురు ఆసియన్లపై బహ్రెయిన్ లో విచారణ ప్రారంభం..!!
- సీజింగ్ వాహనాలు వేలం..సౌమ్ అప్లికేషన్ ద్వారా బిడ్డింగ్..!!
- ఒమన్ లో ఆరుగురు అరబ్ జాతీయులు అరెస్టు..!!
- జెడ్డా ఆకాశంలో నిప్పులుగక్కిన ఫైటర్ జెట్స్..!!
- కువైట్ లో ట్రాఫిక్ చట్టాలపై అవగాహన..!!
- ఆన్లైన్ పిల్లల లైంగిక వేధింపులు..188 మంది అరెస్టు..!!
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!