యెమెన్‌లో దుర్భర క్షామం

- November 22, 2017 , by Maagulf
యెమెన్‌లో దుర్భర క్షామం

యెమెన్‌: ఇప్పటికే యుద్ధంతో అతలాకుతలమవుతున్న, దారిద్య్రంతో మగ్గుతున్న యెమెన్‌పై సౌదీ అమలు చేస్తున్న ఆంక్షలతో పరిస్థితి అత్యంత దుర్భరంగా మారింది. వేలాదిమంది కరువు కాటకాల బారిన పడ్డారు. తినడానికి తిండి లేక, తాగడానికి నీరు లేక, పారిశుధ్య పరిస్థితులు క్షీణించి అత్యంత దయనీయమైన పరిస్థితులు నెలకొన్నాయి. ఆంక్షల అమలు మూడవ వారంలోకి ప్రవేశించింది. సౌదీ విధించిన ఆంక్షలకు అమెరికా మద్దతు వుంది. ఈ ఆంక్షల ప్రభావంతో యెమెన్‌ రాజధాని సానాలో, దక్షిణ మధ్య ప్రాంతమైన బైడా నగరంలో పంపింగ్‌ స్టేషన్లు, పారిశుధ్య కేంద్రాల్లో ఇంధన కొరత ఏర్పడిందని అంతర్జాతీయ రెడ్‌క్రాస్‌ కమిటీ (ఐసిఆర్‌సి) పేర్కొంది. దాంతో పట్టణ ప్రాంతాల్లోని దాదాపు 25లక్షల మంది ప్రజలకు పరిశుద్ధమైన నీరు అందుబాటులో లేకుండా పోయిందని పేర్కొంది. ఈ ఆంక్షలు కారణంగా తాయిజ్‌, సాదా, హుదరుదా నగరాల్లో పారిశుధ్యం లోపించిందని, తాగునీరు లేకుండా పోయిందని ఐసిఆర్‌సి తెలిపింది. దామర్‌, అమ్రామ్‌ నగరాల్లో నీటి, మురుగునీటి వ్యవస్థలు దాదాపు సగం సామర్ధ్యంతో పనిచేస్తున్నాయని తెలిపింది. ఇంతటి అధ్వాన్నంగా పారిశుధ్య పరిస్థితులు కొనసాగితే ఆధునిక చరిత్రలో కలరా అంటువ్యాధి మళ్ళీ విజృంభించే ముప్పు ఎక్కువగా వుంటుందని రెడ్‌క్రాస్‌ కమిటీ హెచ్చరించింది.

ఇప్పటికే ఈ పరిస్థితుల వల్ల 9 లక్షల 40 వేల మందికి పైగా ఇన్‌ఫెక్షన్ల బారిన పడగా, ఏప్రిల్‌ నుండి పలు వ్యాధులతో 2200మందికి పైగా మృత్యువాత పడ్డారని తెలిపింది. రోజుకు 2600 చొప్పున కొత్త కేసులు నమోదవుతున్నాయి. ఈ సంఖ్య ఇంకా పెరిగే అవకాశం వుందని పేర్కొంది. డిఫ్తీరియా (గొంతులోని మ్యూ కస్‌ పొరలకు వచ్చే ఇన్‌ఫెక్షన్‌) వ్యాధి కూడా వేగంగా విస్తరి స్తుండడంతో ఇప్పటికే 10లక్షల మందికి పైగా యెమెన్‌ చిన్నారులు దీని బారిన పడ్డారు.

ఈ నెల 6నుండి అమలవు తున్న ఆంక్షల కారణంగా దాదాపు అన్ని విమానాశ్రయాలు, ఓడరేవులు, సరిహద్దులు మూత పడ్డాయి. తీవ్ర దుర్భిక్షంతో మూకుమ్మడి ఆకలి చావులు సంభవించే పరిస్థితి నెలకొంది. దాదాపు 90శాతం మేరకు దిగుమతి చేసుకున్న ఆహారపదార్ధాలపైనే ఆధారపడాల్సి వస్తోంది. యెమెన్‌లో నెలకొన్న తాజా పరిస్థితులపై జరిగిన సర్వే ఫలితాలు మంగళవారం విడుదలయ్యాయి.

ఈ ఆంక్షలు ఇదే రీతిలో కొనసాగితే ప్రతి రోజూ వేలాదిమంది యెమెన్లు మృత్యువాత పడడం ఖాయమని సర్వే హెచ్చరించింది. ఆంక్షలు ముమ్మ రం చేయడానికి ముందు గానే దాదాపు కోటీ 50లక్షల మంది యెమెన్లు తీవ్ర ఆహార సంక్షోభాన్ని ఎదుర్కొంటు న్నారని పేర్కొంది. కీలకమైన ఓడరేవులను మూసివేయ డంతో ఆహార భద్రత తీవ్ర ముప్పులో పడిందని, దేశంలోని మెజారిటీ ప్రాంతంలో క్షామ పరిస్థితులు నెలకొన్నాయని సర్వే హెచ్చరించింది. కేవలం ఆంక్షల కార ణంగానే ఈ ఏడాది చివరి నాటికి దాదాపు 50వేల మంది ఐదేళ్ళ వయ స్సు లోపు చిన్నారులు మరణ ిస్తారని సేవ్‌ ది చిల్డ్రన్‌ సంస్థ పేర్కొంది.

తక్షణమే ఆంక్షలను ఎత్తివే యాల్సి న పరిస్థితి నెలకొందంటూ ఐక్యరాజ్య సమితి మాజీ ఎయిడ్‌ చీఫ్‌, నార్వే శరణార్థి మండలి అధ్యక్షుడు జాన్‌ ఇంగ్లా ండ్‌ అమెరికా, బ్రిటన్‌, ఇతర సౌదీ మిత్ర దేశాలను ఉద్దేశిస్తూ ట్వీట్‌ చేశారు. గత వారం పలు అంతర్జాతీయ సంస్థలు కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేస్తూ ఒక ప్రకటన జారీ చేశాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com