జెట్ ఎయిర్వేస్ విమానాల్లో ఇక ఫస్ట్‌క్లాస్‌ సీట్లుండవ్‌!

- November 23, 2017 , by Maagulf
జెట్ ఎయిర్వేస్ విమానాల్లో ఇక ఫస్ట్‌క్లాస్‌ సీట్లుండవ్‌!

ప్రముఖ విమానయాన సంస్థ జెట్‌ ఎయిర్‌వేస్‌ ఖర్చులు తగ్గించి ఆదాయాన్ని పెంచుకునేందుకు కొత్త మార్గాలు అన్వేషిస్తోంది. ఇందులో భాగంగా సూదూర ప్రాంతాలకు వెళ్లే తమ బోయింగ్‌ 777 విమానాల్లో ఫస్ట్‌క్లాస్‌ సీట్లను తొలగించాలని నిర్ణయించింది. ఈ మేరకు ఇటీవల ఇన్వెస్టర్ల సమావేశంలో దీనికి సంబంధించిన వివరాలను వెల్లడించింది.ప్రస్తుతం జెట్‌ఎయిర్‌వేస్‌కు 10 బోయింగ్‌ 777 విమానాలు ఉన్నాయి. వీటిలో ఉన్న ఫస్ట్‌క్లాస్‌ సీట్లను తొలగించి మొత్తం సీట్లను పెంచాలని యోచిస్తోంది. ప్రస్తుతం ఈ తరహా విమానాల్లో 8 ఫస్ట్‌క్లాస్‌ సీట్లు, 30 బిజినెస్‌ క్లాస్‌, 308 ఎకానమీ క్లాస్‌ సీట్లు ఉంటాయి. మొత్తంగా 346 సీట్లుండే ఈ విమానంలో మొత్తం సీట్లను 400 వరకు పెంచనున్నట్లు ఇన్వెస్టర్లకు ఇచ్చిన ప్రజంటేషన్‌లో తెలిపింది. 2019 నుంచి ఇది అమల్లోకి తీసుకురానుంది. ఖర్చులు తగ్గించుకుని భవిష్యత్‌లో ఆదాయాన్ని పెంచుకోవడంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు జెట్‌ఎయిర్‌వేస్‌కు చెందిన ప్రతినిధి ఒకరు తెలిపారు.అయితే, దీనికి సంబంధించి పూర్తి వివరాలను కంపెనీ వెల్లడించలేదు. సీట్ల పునరుద్ధరణకు సంబంధించి ఎంతమేర ఖర్చు చేయనున్నారు వంటి తదితర వివరాలను సరైన సమయంలో వెల్లడిస్తామని సదరు ప్రతినిధి తెలిపారు. జెట్‌ ఎయిర్‌వేస్‌కు మొత్తం 110 విమానాలు ఉన్నాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com