ఇవాంక ట్రంప్, మోదీలకు 11 మంది ఐపీఎస్‌లతో భద్రత

- November 23, 2017 , by Maagulf
ఇవాంక ట్రంప్, మోదీలకు 11 మంది ఐపీఎస్‌లతో భద్రత

ఈనెల 28న ప్రధాని నరేంద్ర మోదీ, ఇవాంక ట్రంప్ పర్యటన నేపథ్యంలో రాష్ట్ర సీఎస్ ఎస్పీ సింగ్‌తో కేంద్ర, రాష్ట్ర ఉన్నతాధికారులు సమాశమయ్యారు. ఈ భేటీలో ప్రపంచ పెట్టుబడిదారుల సదస్సు ఏర్పాట్లు, భద్రతపై చర్చించారు.
ఇదిలాఉండగా.. మోదీ, ఇవాంక పర్యటన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం 11 మంది ఐపీఎస్‌లకు భద్రతా బాధ్యతలు అప్పగించింది. వీరిలో ఆరుగురు ఐజీ స్థాయి అధికారులు, ఐదుగురు సీనియర్ ఎస్పీలు ఉన్నారు. మెట్రో రైల్ భద్రతా విధులను ఐజీ అనిల్ కుమార్‌కు అప్పగించగా.. హెచ్ఐసీసీ దగ్గర ఇన్‌చార్జీగా ఐజీ స్టేఫెన్ రవీంద్ర, ఇవాంక బస చేయనున్న హోటల్ వద్ద ఇన్‌చార్జ్‌గా ఐజీ నాగిరెడ్డి, ఇవాంక పర్యటన సందర్భంగా ట్రాఫిక్ ఇన్‌చార్జ్‌గా ఐజీ శ్రీనివాస్ రెడ్డి, ఎయిర్‌పోర్టులో ఇన్‌చార్జ్‌గా షికా గోయల్‌కు భద్రతా బాధ్యతలు అప్పగించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com