ప్రీ లుక్‎తో ఒక్కసారిగా సర్‎ప్రైజ్ చేసిన పవర్ స్టార్...

- November 23, 2017 , by Maagulf
ప్రీ లుక్‎తో ఒక్కసారిగా సర్‎ప్రైజ్ చేసిన పవర్ స్టార్...

పవర్‎స్టార్ పవన్ కల్యాణ్ ఉన్నట్టుండి ఒక్కసారిగా తన కొత్తసినిమాలోని ప్రీ లుక్‎తో అందరినీ సర్‎ప్రైజ్ చేశారు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో పవన్ 25వ సినిమాగా తెరకెక్కుతున్న 'అజ్ఞాతవాసి' (వర్కింగ్ టైటిల్) ప్రీ లుక్‎తో అందరినీ తనవైపు తిప్పుకున్నాడు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై వస్తున్న ఈ సినిమా ప్రీ లుక్ పోస్టర్‎ని కొద్దిసేపటి క్రితం విడుదల చేసింది చిత్రయూనిట్. ఈ లుక్‎లో పవన్ అటు వైపుగా తిరిగి బ్లాక్ షేడ్‎లో కనిపిస్తున్నాడు. ఆయన ముఖం కనిపించకుండా ఇలా డిఫరెంట్ లుక్ బయటకు వదలడం స్పెషల్‎గా అనిపిస్తోంది టాలీవుడ్ ప్రేక్షకులకు. సినిమా ఫస్ట్‎లుక్ నవంబర్ 27న విడుదల చేయనున్నట్లుగా ఈ పోస్టర్‎లో చూపించారు. అదే రోజున సినిమా అసలు టైటిల్ కూడా ప్రకటించనున్నారు. ఈ పోస్టర్ చూడటానికి సాధారణంగా ఉన్నప్పటికీ ఎంతో ఆకర్షణగా నిలుస్తూ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
పవన్ కల్యాణ్- త్రివిక్రమ్ క్రేజీ కాంబోలో రాబోతున్న ఈ సినిమాపై టాలీవుడ్ సహా దేశమంతటా భారీ అంచనాలున్నాయి. ఇందులో పవన్ సరసన కీర్తి సురేష్, అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. అనిరుద్ సంగీత సారథ్యంలోని బాణీలు సినిమాకు స్పెషల్ అట్రాక్షన్. సంక్రాంతి కానుకగా సినిమాను జనవరి 10న విడుదల చేయడానికి అంతా సిద్ధం చేస్తోంది యూనిట్.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com