ట్రాఫిక్ ఉల్లంఘనలను ప్రవాసీయులు పదే పదే పునరావృతం చేస్తే ...దేశబహిష్కరణ
- November 24, 2017
కువైట్:సీటు బెల్ట్ లేకుండా డ్రైవింగ్ చేయడం..అలాగే డ్రైవింగ్ చేస్తున్నప్పుడు చేతితో మొబైల్ ఫోన్ లో మాట్లాడుతున్న తదితర ఉల్లంఘనలను పునరావృతం చేస్తూ ఏ ప్రవాసీయుడైన వ్యవహరిస్తుంటే అటువంటివారిని దేశం నుండి బహిష్కరించాలని మంత్రిత్వ శాఖ వెల్లడించింది. జనరల్ పబ్లిక్ రిలేషన్స్ అండ్ సెక్యూరిటీ మీడియా డిపార్ట్మెంట్ డైరెక్టర్ బ్రిగేడియర్ ఆడెల్ అల్-హషాష్ పైన పేర్కొన్న తీరులో ఇటీవల, అధికారులు పలు వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. ఆయా వాహనదారులు డ్రైవింగ్ చేస్తున్నప్పుడు సీట్ బెల్ట్లను ధరించకపోవడం లేదా మొబైల్ ఫోన్ లో మాట్లాడుతూ వాహనాలను నడపడం తదితర ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడినట్లు తెలిపారు. ఆయా అతిక్రమణలు పాల్పడినవారు వాహనాలను రెండు నెలల పాటు స్వాధీనం చేసుకొనే వీలు ట్రాఫిక్ చట్టం కల్పిస్తుంది, అయితే ట్రాఫిక్ ఉల్లంఘనలను ప్రవాసీయులు పదే పదే పునరావృతం చేస్తే ...వారిని దేశబహిష్కరణ చేయడానికి సైతం వెనుకాడబోమని ఆంతరంగిక మంత్రిత్వశాఖ పేర్కొంది. వాహనదారులు ట్రాఫిక్ నియమాలకు కట్టుబడి ఉండాలని వాహనదారులు మరియు ఇతర రహదారి వినియోగదారుల భద్రత కోసం ట్రాఫిక్ అధికారులతో సహకరించడానికి ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు.
తాజా వార్తలు
- ఇరానియన్ దాడి నేపథ్యంలో కువైట్ విమానాశ్రయంలో అత్యవసర ప్రణాళిక అమలు..
- ఆరోగ్య పర్యాటకాన్ని ప్రోత్సహించేందుకు దుబాయ్ స్మార్ట్ మెడికల్ వీసా
- నార్వే చెస్‌లో ఒకే టోర్నీలో రెండుసార్లు కార్ల్‌సన్‌ను ఓడించిన ప్రజ్ఞానంద
- 2027 గోదావరి పుష్కరాలను అట్టహాసంగా నిర్వహించాలని సీఎం చంద్రబాబు ఆదేశం
- CBSE బోర్డులో భారీ మార్పులు..
- వర్షాకాలంలో నీటి నిల్వలు, ట్రాఫిక్ అంతరాయాల నివారణకు ముందస్తు చర్యలు
- వాహనాలకు పూర్తి నష్టం పేమెంట్స్..సౌదీ సెంట్రల్ బ్యాంక్ కీలక ఉత్తర్వులు..!!
- ఇరాన్, ఇరాక్‌లకు వెళ్లడం పై నిషేధం విధించిన బహ్రెయిన్..!!
- తొలి 30 మిలియన్ దిర్హమ్ల విజేత వివరాలు వెల్లడించిన యూఏఈ లాటరీ..!!
- 'సాస్ ఫర్ ఎక్సలెన్స్' కార్యక్రమాన్ని ప్రారంభించిన ఒమన్ రవాణా మంత్రిత్వ శాఖ..!!









