ఆరు కిలోల నకిలీ బంగారు కళాకృతులను స్వాధీనం చేసుకొన్న మంత్రిత్వ శాఖ

- November 24, 2017 , by Maagulf
ఆరు కిలోల నకిలీ బంగారు కళాకృతులను స్వాధీనం చేసుకొన్న మంత్రిత్వ శాఖ

కువైట్:అల్-ముబారకీయ, అల్-రాయ్ తదితర వివిధ ప్రాంతాలలో అమ్మకానికి సిద్ధంగా ఉన్న ఆరు కిలోగ్రాముల బరువున్న నకిలీ బంగారు కళాకృతులను వాణిజ్య మరియు పరిశ్రమల మంత్రిత్వశాఖ స్వాధీనం చేసుకొంది. 80,000 కువైట్ దినార్ల (సుమారు 261,000 డాలర్లు) విలువ గల వీటిని స్వాధీనం చేసుకుంది. అపరాధులను  ప్రాసిక్యూషన్ ఎదుటకు  పిలవబడ్డారు.అక్రమదారుల నుండి స్వాధీనం చేసుకున్న ఆ నకిలీ బంగారు కళాకృతులు అంతర్జాతీయ ఆభరణాల బ్రాండ్లని అనుకరిస్తూ నకిలీగా ఉంది మరియు బంగారు వస్తువుల బరువును పెంచుకోవటానికి బంగారం తరహా పదార్ధాలతో నింపబడి ఉంది. అంతే కాక ఈ నకిలీ బంగారు కళాకృతులు దుకాణాల వద్ద ప్రదర్శనగా ఉంచి చట్టవిరుద్ధ పద్ధతులలో లాభాలు సంపాదించడానికి తాము అమ్మేవి పూర్తిగా బంగారు వస్తువులని వినియోగదారులను నమ్మబలికి  విక్రయిస్తున్నారని మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. దుకాణాలలో ఉపయోగించిన ప్రమాణాల యొక్క ప్రామాణికతను, అదేవిధంగా బంగారంలో పొదిగిన విలువైన రాళ్ల శాతాన్ని చట్టంలో పేర్కొన్న ఇతర కట్టుబాట్లను పరిశీలించడానికి బంగారు మార్కెట్లలో పర్యవేక్షణ పర్యటనలను మంత్రిత్వ శాఖ తీవ్రతరం చేసింది. ఆ నకిలీ నగల అమ్మకాలతో వినియోగదారులని మోసగించే ఉల్లంఘనకు పాల్పడినవారికి వ్యతిరేకంగా చర్యలు తీసుకోనున్నారు. అంతేకాక  విలువైన ఖనిజాల ఉత్పత్తులను పర్యవేక్షిస్తుంది మరియు మార్కెట్లలో బహిర్గతమయ్యే ఆభరణాలు లేదా దేశం లోపల ఉన్న కర్మాగారాల్లో ఉత్పత్తి చేయబడుతున్న లేదా విదేశాల నుండి వచ్చే నగల అమ్మకాలపై ఇకపై పూర్తిగా దృష్టి కేంద్రీకరించనున్నట్లు మంత్రిత్వశాఖ పేర్కొంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com