కిర్రాక్ పుట్టించిన సన్ బర్న్ ఫెస్టివల్

- November 24, 2017 , by Maagulf
కిర్రాక్ పుట్టించిన సన్ బర్న్ ఫెస్టివల్

హైదరాబాద్‌ : కిక్ ఎక్కించే మ్యూజిక్, అదుర్స్ అనిపించే డ్యాన్సులు. అంతా ఒక్కచోట చేరితో సన్ బర్న్ ఫెస్టివల్. హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియంలో అదుర్స్ అనిపించేలా ఈ ఈవెంట్‌ను నిర్వహించారు. అయితే నిబంధనలకు విరుద్ధంగా ఆలస్యంగా పార్టీని ముగించారని తూ..తూ. మంత్రంగా తనికీలు చేసి మైనర్లను అనుమతించారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. కాగా సన్ బర్న్ ఫెస్టివల్‌కు ఓ వ్యక్తి వెపన్‌తో వచ్చి కలకలం సృష్టించాడు. చెకింగ్ సమయంలో పోలీసులు గుర్తించడంతో అడ్డుకుని...బయటకు పంపేశారు. ఎలాంటి అవాంచనీయ ఘటనలు జరగకుండా...పూర్తి భద్రత ఏర్పాటు చేసిన పోలీసులకు...వెపన్ కనిపించడంతో అప్రమత్తమయ్యారు. గచ్చిబౌలి స్టేడియంలో నిఘాను కట్టుదిట్టం చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com