టాలీవుడ్‌లోకి మరో హీరోయిన్..

- November 24, 2017 , by Maagulf
టాలీవుడ్‌లోకి మరో హీరోయిన్..

ఒకప్పుడు సూపర్ స్టార్ కృష్ణ వెండి తెరని ఏలేశారు.. ఆ తరువాత మహేష్ బాబు మంచి నటుడిగా ఎదుగుతున్నాడు. వారసులు ఎంతమంది ఉన్నా అదృష్టం మాత్రం ఒక్కళ్లనే వరించింది. అందుకే పెద్ద కొడుకు రమేష్, కూతురు మంజులు సినిమాల్లో రాణించలేక పోయారు. అయితే మంజుల చేసింది కొద్ది సినిమాల్లోనే అయినా మంచి పాత్రలు చేసి మంచి పేరు తెచ్చుకుంది. తను నటించిన 'షో' మూవీకి అవార్డులు కూడా వచ్చాయి. ఆ తరువాత నిర్మాతగా మారినా నిలదొక్కుకోలేకపోయింది. ఇప్పుడు మంజుల దర్శకురాలిగా మరో కొత్త పాత్ర పోషించబోతోంది. సందీప్ కిషన్‌ని హీరోగా పెట్టి ఓ మూవీని తెరకెక్కిస్తోంది. మంజుల కూతురు జాన్వి ఈ చిత్రంలో ఓ కీలక పాత్రలో కనిపించనుంది. నటనను వారసత్వంగా పుణికి పుచ్చుకున్న జాన్వి ఈ సినిమాలో నటించిన తీరు చిత్ర యూనిట్ ప్రశంసలకు నోచుకుంది. ఎప్పుడూ షూటింగ్ చాయలక్కూడా రాని జాన్వి మొదటి షూట్‌లో కొంత నెర్వస్ ఫీలయినా ఆ తరువాత ఎటువంటి భయం లేకుండా నటించినట్లు తెలుస్తోంది. దీన్నిబట్టి జాన్వీ కూడా ఇండస్ట్రీకి దొరికిన మరో ఆణిముత్యంగా టాలీవుడ్ వర్గాలు అభివర్ణిస్తున్నాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com