సౌదీ: ఉగ్రసంస్థల నిర్మూలనపై ఉక్కుపాదం

- November 26, 2017 , by Maagulf
సౌదీ: ఉగ్రసంస్థల నిర్మూలనపై ఉక్కుపాదం

రియాద్‌: ఉగ్రసంస్థల నిర్మూలనలో తమ మిత్రదేశాలకు సహకరించనున్నట్టు సౌదీ రాకుమారుడు మహ్మద్‌ బిన్‌ సల్మాన్‌ స్పష్టం చేశారు. రియాద్‌లో సౌదీ మిత్రదేశాల సమావేశం జరిగింది. సౌదీ మిత్రదేశాలకు చెందిన రక్షణ మంత్రులు, ప్రతినిధులు ఈ సదస్సులో పాల్గొన్నారు.ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజయ్యారు. ఉగ్రసంస్థలపై ఉక్కుపాదం మోపుతామని అన్నారు. మిత్రదేశాలకు అవసరమైన ఆయుధాలను అందించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. ఉగ్రవ్యతిరేక ఆపరేషన్‌కు అవసరమైన సహకారాన్ని అందిస్తామని అన్నారు. సౌదీ మిత్రదేశాలన్ని పరస్పర సహాయ సహకారాలను అందించుకుంటూ సమిష్టి కృషి చేస్తున్నాయనే సందేశాన్ని ప్రపంచ దేశాలకు అందించాలన్నదే తమ అభిమతం అన్నారు. ఇస్లామిక్‌ మిలిటరీ అలియన్స్‌ (ఐఎంఏ) 2015, డిసెంబర్‌15న రియాద్‌లో ఏర్పాటైంది. ఈ గ్రూప్‌లో ప్రస్తుతం 41 సభ్య దేశాలున్నాయి. పాకిస్థాన్‌ ఆర్మీ జనరల్‌ (రిటైర్డ్‌ ) రాహిల్‌ షరీఫ్‌ ఈఏడాది ఏప్రిల్‌ నుంచి సౌదీ సంకీర్ణదళాలు నిర్వహిస్తున్న యాంటీ టెర్రరిజం ఆపరేషన్స్‌ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com