ప్రీ రిలీజ్ బిజినెస్ లో 'సాహో' అనిపిస్తోన్న ప్రభాస్
- November 27, 2017
బాహుబలి ది కన్ క్లూజన్ 1800లకోట్లకు పైగా వసూళ్లు సాధించడంతో ప్రభాస్ నెక్ట్స్ సినిమాపై అంచనాలు ఎక్కవయ్యాయి. డార్లింగ్ కు నేషనల్ వైడ్ గా పాపులారిటీ రావడంతో, ప్రభా నెక్ట్స్ ఏ మూవీ చేస్తాడు? ఏ దర్శకుడితో జతకడతాడు? అని ఆల్మోస్ట్ ఆల్ ఇండియన్ సినిమా మొత్తం ఆరా తియ్యడం మొదలుపెట్టింది. ప్రభాస్ మాత్రం బాహుబలి ది బిగినింగ్ టైంలో చెప్పినట్లుగానే రన్ రాజా రన్ దర్శకుడు సుజిత్ తో సాహో సినిమా మొదలుపెట్టాడు. ఇది చాలా మందిని ఆశ్చర్చపరిచింది.
ఇండియన్ సినిమాలో సరికొత్త రికార్డులు క్రియేట్ చేసిన సినిమా తర్వాత ప్రభాస్, చిన్న దర్శకుడితో సినిమా చెయ్యడం ఏంటని? చాలా మంది అనుకున్నారు. కానీ సుజిత్ మాత్రం తన యాక్షన్ ఎంటర్టైనర్ ను హాలివుడ్ స్టైల్లో తెరకెక్కిస్తున్నానని టీజర్ తోనే చెప్పేశాడు. ప్రభాస్ కటౌట్ కు తగ్గ స్టోరీతో సాహో సినిమాను రెడీ చేస్తున్నాడు. దీంతో సినిమాపై మంచి బజ్ క్రియేట్ అయ్యింది.
పాజిటివ్ హైప్స్ తో తెలుగు,తమిళ్, మళయాలీ,హిందీ భాషల్లో రూపొందుతోన్న సాహో సినిమా ప్రీరిలీజ్ బిజినెస్ కూడా అదిరిపోతోంది. సాహో సినిమా తమిళ, హిందీ థియేట్రికల్ రైట్స్ కు 210కోట్లవరకు ఆఫర్స్ వస్తున్నాయట. ఇక తెలుగులో 90నుంచి 100కోట్ల వరకు బిజినెస్ చేస్తుందని చెబుతున్నారు. బాహుబలి హీరో అనే ఇమేజే ఈ బిజినెస్ కు మెయిన్ రీజన్ అని చెప్పొచ్చు. సో 150కోట్ల బడ్జెట్ తో రూపొందే ఈసినిమా యువి క్రియేషన్స్ కు భారీ ప్రాఫిట్స్ తెచ్చేలా కనిపిస్తోంది. శ్రద్దా కపూర్ హీరోయిన్ గా నటిస్తోన్న ఈసినిమా వచ్చే ఏడాది సమ్మర్ లో రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది.
తాజా వార్తలు
- త్వరలో వెబ్‌లో గ్రూప్ వీడియో, ఆడియో కాల్స్ సౌకర్యం
- దావోస్ కు బయల్దేరిన చంద్రబాబు, రేవంత్ రెడ్డి
- స్పెయిన్ లో ఘోర రైలు ప్రమాదం.. 21 మంది మృతి
- ఎన్ఆర్ఐ టీడీపీ బహ్రెయిన్ ఆధ్వర్యంలో ఎన్టిఆర్ 30వ వర్ధంతి
- అవాలి అభివృద్ధి మాస్టర్ ప్లాన్ పై కింగ్ హమద్ సమీక్ష..!!
- యూఏఈ దిర్హమ్కు రూ.25కు చేరువలో భారత రూపాయి..!!
- విదేశీ వాహనదారులకు ఖతార్ గుడ్ న్యూస్..!!
- రియాద్ లో దక్షిణ యెమెన్ నాయకులు..కీలక ప్రకటన..!!
- కువైట్ ‘లులు’లో బ్రిటిష్ డెయిరీ ప్రొడక్ట్స్ వీక్..!!
- ఒమన్‌లో 8.5% పెరిగిన బ్యాంకు లోన్లు..!!







