రిలీజ్ కు ముందే సూపర్ స్టార్ రోబో 2.0 రికార్డుల మీద రికార్డులు
- November 27, 2017
టు పాయింట్ ఓ రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తోంది. శంకర్ భారీ విజన్ తో హాలివుడ్ రేంజ్ లో తెరకెక్కుతోన్న ఈసినిమా రిలీజ్ కు ముందే సంచలనాలు సృష్టిస్తోంది. 450కోట్లకు పైగా బడ్జెట్ తో తెరకెక్కుతోన్న ఈసినిమా ఇప్పుడు డిజిటల్ రైట్స్ తో ప్రకంపనలు రేపుతోంది.
శంకర్ రజనీకాంత్ కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న టు పాయింట్ ఓ సినిమా రికార్డుల వేట కంటిన్యూ అవుతూనే ఉంది. రోబో సీక్వెల్ గా భారీ గ్రాఫిక్స్ తో విజువల్ వండర్ గా రూపొందుతోన్న ఈసినిమా ఇప్పటికే థియేట్రికల్ రైట్స్ తో ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో రికార్డులు క్రియేట్ చేసింది. తెలుగు థియేట్రికల్ రైట్స్ కే 81కోట్లు వచ్చాయంటే, తమిళ, హిందీ, అండ్ వరల్డ్ వైడ్ రైట్స్ ఏ స్థాయిలో అమ్ముడయ్యాయో అర్దం చేసుకోవచ్చు.
ట్రేడ్ మార్కెట్ లో టు పాయింట్ ఓ ధియేట్రికల్ రైట్స్ పాస్ చేస్తోన్న మేనియా కంటిన్యూ అవుతుండగానే అమేజాన్ ప్రైమ్ వీడియో డిజిటల్ రైట్స్ కు భారీ మొత్తం చెల్లించింది. అన్ని భాషల డిజిటల్ రైట్స్ ను ఎవ్వరూ ఎక్స్ పెక్ట్ చెయ్యని మొత్తంతో తీసుకుందట అమేజాన్. ఇదే ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా నిలుస్తోంది.
రజనీకాంత్-ఎమీ జాక్సన్ లీడ్ రోల్స్ లో రూపొందుతోన్న ఈసినిమాలో అక్షయ్ కుమార్ విలన్ గా నటిస్తున్నాడు. అక్షయ్ ఈసినిమాలో 12క్యారెక్టర్స్ లో కనిపిస్తాడనే బజ్ సినిమాపై మరింత క్యూరియాసిటీ పెంచుతోంది. ప్రైడ్ ఆఫ్ ఇండియన్ టెక్నీషియన్స్ అనే రేంజ్ లో లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తోన్న ఈసినిమా సమ్మర్ లో 2018ఏప్రిల్13న రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది.
తాజా వార్తలు
- అవాలి అభివృద్ధి మాస్టర్ ప్లాన్ పై కింగ్ హమద్ సమీక్ష..!!
- యూఏఈ దిర్హమ్కు రూ.25కు చేరువలో భారత రూపాయి..!!
- విదేశీ వాహనదారులకు ఖతార్ గుడ్ న్యూస్..!!
- రియాద్ లో దక్షిణ యెమెన్ నాయకులు..కీలక ప్రకటన..!!
- కువైట్ ‘లులు’లో బ్రిటిష్ డెయిరీ ప్రొడక్ట్స్ వీక్..!!
- ఒమన్‌లో 8.5% పెరిగిన బ్యాంకు లోన్లు..!!
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!







