బిత్తిరి సత్తిపై దాడి...ఆసుపత్రిలో చేరిక

- November 27, 2017 , by Maagulf
బిత్తిరి సత్తిపై దాడి...ఆసుపత్రిలో చేరిక

ఫిల్మ్‌నగర్‌: పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. పోలీసుల కథనం ప్రకారం... సోమవారం మధ్యాహ్నం బిత్తిరి సత్తి బంజారాహిల్స్‌లోని ఎమ్మెల్యేకాలనీలో గల ఛానల్‌ కార్యాలయానికి కారులో డ్రైవర్‌తో కలిసి రోజూలాగే వచ్చారు. డ్రైవర్‌ కారు ఆపగానే కార్యాలయంలోకి వెళ్లేందుకు సత్తి కారు దిగారు. అప్పటికే అక్కడ ఉన్న సికింద్రాబాద్‌ ప్యారడైజ్‌ ప్రాంతంలోని కళాసిగూడకు చెందిన మణికంఠగౌడ్‌ (26) సత్తిపై పిడుగుద్దులు కురిపించాడు. తెలంగాణ భాషను అవమానించేలా నీ మాటలు ఉన్నందున దాడి చేస్తున్నానని, తీన్మార్‌ కార్యక్రమం ద్వారానే ప్రజలకు క్షమాపణ చెప్పాలని మణికంఠగౌడ్‌ కేకలు వేశాడు. ఆ సమయంలో ఆ పక్కనే ఉన్న కొందరు మణికంఠగౌడ్‌ను పట్టుకుని చితకబాదారు. ఓ వ్యక్తి తన శిరస్త్రాణంతో నిందితుడిపై దాడి చేశాడు. అందరూ నిందితుడిని కదలనివ్వకుండా పట్టుకుని బంజారాహిల్స్‌ పోలీసులకు అప్పగించారు. దాడిలో గాయపడిన బిత్తిరి సత్తిని బంజారాహిల్స్‌లోని స్టార్‌ ఆసుపత్రికి చికిత్స కోసం తరలించారు. సత్తి ఫిర్యాదు మేరకు మణికంఠగౌడ్‌పై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించినట్లు ఇన్‌స్పెక్టర్‌ కె.శ్రీనివాస్‌ తెలిపారు. మణికంఠగౌడ్‌ను ఇన్‌స్పెక్టర్‌ కె.శ్రీనివాస్‌ వివిధ కోణాల్లో విచారించారు. అతనికి మతి స్థిమితం లేదని కుటుంబీకులు ఇన్‌స్పెక్టర్‌ దృష్టికి తెచ్చారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com