ఇస్లామిక్ స్టేట్ తీవ్రవాదుల నుంచి ఇవాంకా కు పొంచి ఉన్న ముప్పు...అప్రమత్తంగా పహరా
- November 27, 2017
హైదరాబాద్ : అంతర్జాతీయ వ్యాపారవేత్తల సదస్సులో పాల్గొనేందుకు హైదరాబాద్ నగరానికి వచ్చిన ఇవాంకాకు భద్రతను కట్టుదిట్టం చేశారు. ఇస్లామిక్ స్టేట్ తీవ్రవాదుల నుంచి ముప్పు పొంచి ఉందని అమెరికా ఇంటలిజెన్స్ ఏజెన్సీలు చేసిన హెచ్చరికల నేపథ్యంలో ఇవాంకా ట్రంప్ భద్రత కోసం 10,400 మంది పోలీసులను తెలంగాణ సర్కారు మోహరించింది. 8 మంది అమెరికన్ సీక్రెట్ సర్వీస్ అధికారుల పహరా మధ్య ఇవాంకా సదస్సులో పాల్గొంటారని ఓ పోలీసు అధికారి వెల్లడించారు. క్లోజ్ డ్ ప్రొటెక్షన్ టీమ్ మధ్య బుల్లెట్ ఫ్రూఫ్ కారులో ఇవాంకా ప్రయాణిస్తారు. తెలంగాణ ఇంటలిజెన్స్ సెక్యూరిటీ విభాగం అధికారులు కూడా ఇవాంకా భద్రతను పర్యవేక్షిస్తున్నారు. దీంతోపాటు ఇవాంకా రక్షణ కోసం తెలంగాణా సర్కారు గ్రేహౌండ్స్, ఆక్టోపస్ పోలీసు బలగాలను రంగంలోకి దింపింది. హైదరాబాద్ స్థానిక పోలీసులు అవుటర్ కవర్ గా ఇవాంకాకు భద్రత కల్పిస్తున్నారు. హైదరాబాద్ నగర పరిసర ప్రాంతాల్లో ఐఎస్ఐఎస్ సానుభూతిపరులుగా అనుమానిస్తున్న 200 మందిపై తెలంగాణ కౌంటర్ ఇంటలిజెన్స్ సెల్ అధికారులు నిఘా పెట్టారు. ఇవాంకా భద్రత కోసం తెలంగాణ పోలీసులు ప్రత్యేకంగా ఇజ్రాయిల్ దేశం నుంచి విధ్వంసక వ్యతిరేక, యాంటీ ఎక్స్ ప్లోజివ్ ప్రత్యేక పరికరాలను తెప్పించి రంగంలోకి దించారు. ఇవాంకా భద్రత కోసం పోలీసు బలగాలు అనుక్షణం అప్రమత్తంగా పహరా కాస్తున్నాయి.
తాజా వార్తలు
- కాల్పుల విరమణ ఒప్పందాన్ని స్వాగతించిన ఖతార్..!!
- సౌదీలో పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు తగ్గుదల: ఎన్సిఎం
- ఫ్రంట్లైన్ కార్మికులకు DH 15 మిలియన్లతో రికగ్నిషన్ ఫండ్..!!
- కువైట్ లో రోడ్లకు మహర్దశ..!!
- వాహనాలు, దుకాణాలలో చోరీలు.. వ్యక్తి అరెస్ట్..!!
- సహోద్యోగిపై వేడినీరు పోసిన కేఫ్ ఉద్యోగికి మూడేళ్ల జైలుశిక్ష..!!
- ఇళయరాజాకు ‘పద్మపాణి’ అవార్డు
- బ్యాంక్ ఆఫ్ బరోడాలో జాబ్స్..
- వ్యభిచారం, డ్రగ్స్ రాకెట్ కేసులో భారత దంపతుల అరెస్ట్
- ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడితో సీఎం చంద్రబాబు భేటీ







