ఓమాన్ లో అగ్నిప్రమాదం... ఎనిమిదిమంది మహిళలు సజీవ దహనం

- November 28, 2017 , by Maagulf
ఓమాన్ లో అగ్నిప్రమాదం... ఎనిమిదిమంది మహిళలు సజీవ దహనం

మస్కట్ : ఓమాన్ బర్కా ప్రాంతంలో ఒక ఇంట్లో మంగళవారం తెల్లవారుజామున జరిగిన ఘోర అగ్ని ప్రమాదంలో ఎనిమిదిమంది మహిళలు తమకు ఏమి జరుగుతుందో తెలియని స్థితిలో నిద్రలోనే సజీవ దహనమయ్యారు. ఒక తల్లి..ఆమె 5 గురు కుమార్తెలు..మరో ఇద్దరు మహిళలు ఈ విషాదమైన దుర్ఘటనలో కాలి బూడిదయ్యారు. ఆ మంటలలో చిక్కుకొన్న8 మందిని రక్షించడానికి వారి బావ తీవ్ర ప్రయత్నం చేశారు. కానీ ఆయన యత్నాలు ఫలించలేదు. ఈ అగ్నిప్రమాదంలో ఒక 35 ఏళ్ల వయస్సు ఉన్న తల్లి ఆమె అయిదుగురు కుమార్తెలు (7 ఏళ్ళ వయస్సు నుంచి 15 ఏళ్ల వయస్సులో్పున ఉన్నబాలికలు), 28 ఏళ్ల సోదరి, ఒక ఇథియోపియన్ దేశానికి చెందిన పనిమనిషి అగ్ని జ్వాలలలో తగలబడిపోయారు. సివిల్ డిఫెన్స్ అండ్ ఆంబులెన్స్ పబ్లిక్ అథారిటీ (పిఏసిడిఏ) కు చెందిన ప్రతినిధి ఈ సందర్భంగా మాట్లాడుతూ, రెండవ అంతస్తులో నిద్రిస్తున్న సోదరి భర్త  వేడి అవుతున్న వాతావరణానికి అకస్మాత్తుగా మేల్కొన్నాడు. ఒక గది లోపల నుంచి పొగలు దట్టంగా వెలువడటం గమనించి మంటలలో చిక్కుకొన్న వారిన కాపాడేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. వారినందరిని ఏదోవిధంగా వెలుపలకు రప్పించేందుకు వంటరిగా చేసే యత్నంలో ఆయన  కిటికీలు సైతం విరగకొట్టాడని తెలిపారు. " అంతేకాక ఆయన రెండవ అంతస్తులో ఉన్న తండ్రిని రక్షించారు. మరికొందరిని కాపాడేందుకు తిరిగి అక్కడకు వెళ్లేందుకు మరల ప్రయత్నించారు, కానీ ఆ గదుల నుంచి వ్యాపిస్తున్న పొగ కారణంగా ఊపిరి తీసుకోవడానికే ఆయనకు కష్టమై కనీసం అక్కడ నిలబడలేని పరిస్థితి లో మిగతావారిని రక్షించలేకపోయారని ఆ అధికారి తెలిపారు. జనరల్ కార్యకలాపాల కేంద్రం సివిల్ డిఫెన్స్ అండ్ ఆంబులన్స్ కు ప్రమాదం గురించి అధికారకంగా సమాచారం అందినట్లు తెలిపారు మంగళవారం తెల్లవారుజామున 4:35 గంటల సమయంలో బర్కాలోని అల్ సలాం పరిసరాల్లో ఒక ఇంటిలో జరిగిన అగ్నిప్రమాద విషయం తెలియడంతోనే  అగ్నిమాపక సిబ్బంది కేవలం 7 నిమిషాలలో సంఘటన స్ధలానికి  చేరుకొని మంటలు ఆర్పడం మొదలుపెట్టామని  ఆ అధికారి తెలిపారు. అగ్నిమాపక అంతస్తులో అగ్ని మొదలైంది అని అనుమానిస్తున్నారు. " ప్రాథమిక సమాచారం ప్రకారం, ఆ ఇంటి మధ్యలో అగ్ని మొదలై మంటలు కేంద్రీకృతమై తరువాత మిగతా ప్రాంతాలకు  పొగలు వ్యాప్తి చెందాయిని అధికారులు చెప్పారు. ఆ మంటలలో చిక్కుకున్న వ్యక్తుల అన్వేషణ తర్వాత, తగలబడిపోయి బూడిదగా మారిన స్థితిలో ఉన్న ఎనిమిది మృతదేహాలను పై అంతస్తులో కనుగొన్నారు, ఈ అగ్ని ప్రమాదం ఎలా జరిగిందో ఇప్పటికీ తెలియదని వాస్తవ కారణాన్ని కనుగొనేందుకు దర్యాప్తు చేస్తున్నాని సివిల్ డిఫెన్స్ అండ్ ఆంబులెన్స్ పబ్లిక్ అథారిటీ (పిఏసిడిఏ) కు చెందిన ఒక అధికారి తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com